మహనీయుల పేర్లు మార్చడమే అభివృద్ధా?

ABN , First Publish Date - 2022-10-08T06:11:08+05:30 IST

మహనీయుల పేర్లు మార్చడమే అభివృద్ధా?

మహనీయుల పేర్లు మార్చడమే అభివృద్ధా?
మాట్లాడుతున్న మండలి బుద్ధప్రసాద్‌

అవనిగడ్డ టౌన్‌, అక్టోబరు 7: మహనీయుల పేర్లను మార్చడమే అభివృద్ధా అని సీఎం జగన్మోహన్‌రెడ్డిని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్‌ ప్రశ్నించారు. హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ అవనిగడ్డలో టీడీపీ చేస్తున్న రిలే దీక్షలు ఏడో రోజుకు చేరు కున్నాయి. ఘంటసాల మండలానికి చెందిన పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు దీక్షలో కూర్చున్నారు. దీక్షను ప్రారంభించాక మండలి మాట్లా డారు. నిర్మించడం చేతగాని సీఎం పేర్లు మార్చడం ద్వారా అభివృద్ధి సాధిం చామని చెప్పదలిచారా అని ప్రశ్నించారు. దీక్షలో అయినపూడి భానుప్రకాష్‌, మిక్కిలినేని మధు, పరిశె చలపతిరావు, ఆరుంబాక రవి, ముప్పనేని రవి ప్రసాద్‌, బి.వెంకటేశ్వరమ్మ, ఆవుల ధర్మవెంకట నరసయ్య, చలపాటి రాణి, కొడాలి లక్ష్మణరావు, కుంపటి చిట్టిబాబు, సోలే శ్రీనివాసరావు, మద్దాలి వెంక టేశ్వరరావు, తుమ్మలచర్ల మురళీకృష్ణ, దిరిశం సుధీర్‌, తరకటూరి భాగ్యా రావు, శీలం శివాజీ, కొల్లూరి సునీల్‌, తరకటూరి శ్రీకాంత్‌, నాగేశ్వరరావు, మేకా శ్రీనివాసరావు, టి.శ్రీనివాసరావు, కె.రాంబాబు పాల్గొన్నారు. జిల్లా పరిషత్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ గొర్రెపాటి వెంకట రామకృష్ణ, కొల్లూరి వెంక టేశ్వరరావు, యాసం చిట్టిబాబు, బండే రాఘవ, బచ్చు రఘునాథ్‌, మాచ వరపు ఆదినారాయణ తదితరులు సంఘీభావం తెలిపారు. సాయంత్రం రొటేరియన్‌ మత్తి శ్రీనివాసరావు, మండలి రామ్మోహనరావు, బచ్చు మల్లి, లింగం బాబూరావు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. Read more