టైలరింగ్‌లో ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

ABN , First Publish Date - 2022-11-25T00:57:13+05:30 IST

ఆత్కూరు స్వర్ణభారత్‌ట్ర్‌స్టలో టైలరింగ్‌లో ఉచిత శిక్షణ పొందేందుకు ఉభయ కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరిజిల్లాలకు చెందిన మహిళలు దరఖాస్తు చేసుకోవాలని స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డి.పరదేశి తెలిపారు.

టైలరింగ్‌లో ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

ఉంగుటూరు, నవంబరు 24 : ఆత్కూరు స్వర్ణభారత్‌ట్ర్‌స్టలో టైలరింగ్‌లో ఉచిత శిక్షణ పొందేందుకు ఉభయ కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరిజిల్లాలకు చెందిన మహిళలు దరఖాస్తు చేసుకోవాలని స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డి.పరదేశి తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గ్రామీణప్రాంతాల్లో పేదవర్గాలకు చెందిన మహిళలకు వివిధ చేతివృత్తుల్లో ఉచిత శిక్షణ అందించడంతో పాటు స్వయంఉపాధితో ఎదిగేందుకు అవసరమైన తోడ్పాటును ట్రస్ట్‌ అందిస్తుందన్నారు. దీనిలో భాగంగా డిసెంబరు తొలివారం నుంచి టైలరింగ్‌లో మహిళలకు శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. శిక్షణ కాలవ్యవధి రెండునెలలుంటుందని, 18-35 సంవత్సరాల మధ్య వయసు కలిగి, కనీసం 8వతరగతి చదివిన మహిళలు అర్హులని చెప్పారు. శిక్షణాకాలంలో ఉచిత భోజనం, వసతి సదుపాయాలు కల్పిస్తామని, శిక్షణానంతరం ఉచితంగా కుట్టుమిషన్‌, టూల్‌కిట్లు అందజేస్తామని తెలిపారు. హాస్టల్లో వీలుపడనివారు, రోజూ తరగతులకు వచ్చి వెళ్లాలనుకునే వారికి (డేస్కాలర్స్‌) మధ్యాహ్నం ఉచితంగా భోజనం అందజేస్తామన్నారు. ఆసక్తి, అర్హత గల మహిళలు 934795665 నెంబర్‌కు ఫోన్‌చేసి తమ పేరు రిజిస్టర్‌ చేసుకోవాలని పరదేశి సూచించారు.

వృత్తి నైపుణ్య కోర్సుల్లో..

ఆత్కూరు స్వర్ణభారత్‌ట్ర్‌స్టలోని ఏపీజే అబ్దుల్‌కలాం నైపుణ్యాభివృద్ధి శిక్షణాకేంద్రంలో వివిధ వృత్తినైపుణ్య కోర్సుల్లో ఉచిత శిక్షణ పొందేందుకు ఆసక్తిగల నిరుద్యోగ యువత నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు శిక్షణాకేంద్రం డైరెక్టర్‌ ఐ.విజయభాస్కరరావు తెలిపారు. ప్లంబింగ్‌, ఎలక్ట్రీషియన్‌, సోలార్‌, టూ వీలర్‌, ఫోర్‌ వీలర్‌ మెకానిజం, ఏసీ మెకానిజం తదితర కోర్సుల్లో కొత్త బ్యాచ్‌లకు శిక్షణతరగతులు ఈనెల 28నుంచి ప్రారంభమవుతాయని చెప్పారు. మూడునెలల కాలవ్యవధితోకూడిన కోర్సుల్లో శిక్షణపొందేందుకు 18-35సంవత్సరాల మధ్య వయసు, పదోతరగతి, ఇంటర్‌, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ చదివిన యువకులు అర్హులని పేర్కొన్నారు. శిక్షణాకాలంలో అభ్యర్థులకు ఉచిత భోజన, వసతి సౌకర్యాలు కల్పించబడతాయని, శిక్షణానంతరం ధ్రువపత్రములతోపాటు, వివిధ ప్రైవేట్‌ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయని తెలిపారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు తమ వివరాలతో దరఖాస్తుచేసుకోవాలని సూచించారు. వివరాలకు 8500259640 నెంబరులో సంప్రదించాలని డైరెక్టర్‌ కోరారు.

Updated Date - 2022-11-25T00:57:15+05:30 IST