సంకల్ప బలం ఉంటే దేనినైనా సాధించవచ్చు

ABN , First Publish Date - 2022-10-14T05:52:50+05:30 IST

సంకల్ప బలం ఉంటే దేనినైనా సాధించవచ్చునని ఫోపల్‌ టెక్నాలజీస్‌ సీఈవో ఏ గోపిరాజు అన్నారు.

సంకల్ప బలం ఉంటే దేనినైనా సాధించవచ్చు
ప్రసంగిస్తున్న గోపిరాజు

సంకల్ప బలం ఉంటే దేనినైనా సాధించవచ్చు

 ఫోపల్‌ టెక్నాలజీస్‌ సీఈవో గోపిరాజు 

వన్‌టౌన్‌, అక్టోబరు 13: సంకల్ప బలం ఉంటే దేనినైనా సాధించవచ్చునని ఫోపల్‌ టెక్నాలజీస్‌ సీఈవో ఏ గోపిరాజు అన్నారు. కేబీఎన్‌ కళాశాలలో కస్టమైజేషన్‌ ఆఫ్‌ కమర్షియలైజ్డ్‌ అగ్రికల్చరల్‌ డ్రోన్స్‌ అంశంపై గురువారం వర్క్‌షాఫు జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యవక్తగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, సంకల్పబలం ఉంటే ఏదైనా సాధించవచ్చునని, చిత్తశుద్ధితో కృషి చేస్తే విజయాలు వరిస్తాయన్నారు. రానున్న కాలంలో డ్రోన్లకు డిమాండ్‌ ఉంటుందన్నారు. వ్యవసాయరంగంలో డ్రోన్లకు విస్తృత అవకాశాలు ఉన్నాయని తెలిపారు. డ్రోన్ల వినియోగంపై రైతు భరోసా కేంద్రాలలో రైతులకు అవగాహన కల్పిస్తున్నారన్నారు. ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ నారాయణరావు మాట్లాడుతూ, కళాశాలలో డ్రోన్లకు సంబంధించి డిప్లామా కోర్సులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వైస్‌ ప్రిన్సిపాల్‌ పీఎల్‌ రమేష్‌, ఏక్యూఏసీ కన్వీనర్‌ డాక్టర్‌ జి.కృష్ణవేణి, హేమంత్‌ కుమార్‌ పాల్గొన్నారు.


Read more