హోంగార్డు బలవన్మరణం

ABN , First Publish Date - 2022-01-04T05:27:32+05:30 IST

హోంగార్డు బలవన్మరణం

హోంగార్డు బలవన్మరణం

ఇద్దరు వ్యక్తుల వేధింపుల వల్లేనని సూసైడ్‌ నోట్‌

జగ్గయ్యపేట, జనవరి 3 : స్థానిక వివేకానందనగర్‌లో నివాసం ఉంటున్న చిల్లకల్లు  పోలీస్‌స్టేషన్‌ హోంగార్డు జె.నాగరాజు (40) సోమవారం ఇంట్లో అనుమానాస్పద స్థితిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మర ణానికి పాల్పడ్డాడు. చిల్లకల్లు స్టేషన్‌ జీపు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మధ్యాహ్నం 2 గంటలకు డ్యూటీ దిగి జగ్గయ్యపేటలోని ఇంటికి వచ్చి ఉరేసుకున్నాడు. స్థానికులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాగరాజుది జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడు స్వగ్రామం కాగా, భార్య అంగన్‌వాడీ టీచర్‌. ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడు రాసినట్టుగా చెబుతున్న లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వత్సవాయి మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులు డబ్బుల కోసం వేధిస్తున్నారని, కులాన్ని కించపరుస్తున్నారని, ఉద్యోగం తీసివేయిస్తామని బెదిరిస్తున్నారని లేఖలో పేర్కొన్నాడు. ప్రభుత్వ విప్‌ ఉదయభాను ప్రభుత్వాసుపత్రిలోని హోంగార్డు భౌతికకాయాన్ని సందర్శిం చారు. జగ్గయ్యపేట సీఐ చంద్రశేఖర్‌ సంఘటనాస్థలిని పరిశీలించారు.

Read more