ఫాస్ట్‌ఫుడ్‌తో గుండెజబ్బులు

ABN , First Publish Date - 2022-09-30T05:51:56+05:30 IST

చాలా మంది చిన్న వయసు నుంచే ఫాస్ట్‌ ఫుడ్‌కు అలవాటు పడి యుక్తవయస్సు వచ్చాక గుండె సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారని ఆయుష్‌ హాస్పిటల్స్‌ కార్డియాలజీ హెచ్‌వోడి డాక్టర్‌ శ్రీనివాస చౌదరి అన్నారు.

ఫాస్ట్‌ఫుడ్‌తో గుండెజబ్బులు
మాట్లాడుతున్న డాక్టర్‌ శ్రీనివాస చౌదరి

ఫాస్ట్‌ఫుడ్‌తో గుండెజబ్బులు

ఆయుష్‌ హాస్పిటల్స్‌ కార్డియాలజీ హెచ్‌వోడీ డాక్టర్‌ శ్రీనివాస చౌదరి 

పాయకాపురం, సెప్టెంబరు 29 : చాలా మంది చిన్న వయసు నుంచే ఫాస్ట్‌ ఫుడ్‌కు అలవాటు పడి యుక్తవయస్సు వచ్చాక గుండె సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారని ఆయుష్‌ హాస్పిటల్స్‌ కార్డియాలజీ హెచ్‌వోడి డాక్టర్‌ శ్రీనివాస చౌదరి అన్నారు. వరల్డ్‌ హార్ట్‌ డే సందర్భంగా ఆయుష్‌ హాస్పిటల్‌లో గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. డాక్టర్‌ వై. రమేష్‌ బాబు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆహార విధానాలు, వ్యాయామంతో కూడిన చురుకైన జీవన విధానంతో హార్ట్‌ ఎటాక్స్‌ రాకుండా నివారించవచ్చని పేర్కోన్నారు. హాస్పిటల్‌లో ఈ నెలలో ప్రవేశ పెట్టిన ప్రత్యేక హార్ట్‌ చెకప్స్‌ ప్యాకేజీ, సీటీ కాల్షియం స్కోర్‌, సీటీ యాంజియో గ్రామ్‌లపై ప్రత్యేక రాయితీని మరొక నెల రోజుల పాటు పొడిగిస్తున్నట్లు వెల్లడించారు.  ఎలకో్ట్రఫిజియాలజిస్ట్‌ డాక్టర్‌ జి. సోమశేఖర్‌, మెడికల్‌ సూపరింటెండెంట్‌ కెఎల్‌వి. ప్రసాద్‌, సీఏవో జయలక్ష్మి, ఏజీఎం వి. రామకృష్ణ పాల్గొన్నారు. 

Read more