-
-
Home » Andhra Pradesh » Krishna » hamila amallo cm vipalam-NGTS-AndhraPradesh
-
హామీల అమల్లో సీఎం విఫలం
ABN , First Publish Date - 2022-02-19T06:10:00+05:30 IST
హామీల అమల్లో సీఎం విఫలం

మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్
ఆకునూరు(ఉయ్యూరు), ఫిబ్రవరి 18 : పాదయాత్ర, ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి ఘోరంగా విఫలమయ్యారని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఆరోపించారు. నియోజక వర్గంలో చేపట్టిన చంద్రన్న భరోసాయాత్రలో భాగం గా శుక్రవారం పెదఓగిరాల, ఆకునూరు, చినఓగిరాల, ఆనందపురం గ్రామాల పరిధిలో పుల్లేరు కాల్వకట్టపై పర్యటించి స్థానికుల సమస్యలు అడిగి తెలుసు కున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిత్యావసర సరుకులతో పాటు అన్ని వస్తువుల ధరలు పెరిగి పేద మధ్యతరగతి ప్రజలపై పెనుభారం పడినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. నియోజకవర్గంలో పేదల ఇళ్ల స్థలాలకు సేకరించిన స్థలాల్లో పెద్దఎత్తున అవినీతికి పాల్పడ్దారని, నియోజకవర్గంలో అభివృద్ధి మచ్చుకైనా కన్పించడం లేదన్నారు. అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్న స్థానిక ఎమ్లెల్యే, ఆయన అనుచరులు కాంట్రాక్టర్లుగా ప్రజాధనాన్ని అడ్డగోలుగా దోచుకుని అభివృద్ధి చెందారని ఆరోపించారు.
తెలుగు యువత నాయకుడు దండమూడి చౌదరి, పార్టీ మండల అధ్యక్షుడు యెనిగళ్ల కుటుం బరావు, ఆకునూరు సర్పంచ్ వసంత కుమార్, పార్టీ నాయకులు పోతిరెడ్డి, పిచ్చిరెడ్డి. ఓగిరాల నాగభూషణం, తదిరులు పాల్గొన్నారు.