ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు

ABN , First Publish Date - 2022-09-29T06:39:09+05:30 IST

డెమోక్రటిక్‌ పీఆర్‌టీ యూ-ఏపీ, కలపాల నీలిమాదేవి మెమో రియల్‌ ట్రస్ట్‌ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం ఎంజీ రోడ్డులోని ఠాగూర్‌ స్మారక గ్రంథాలయంలో ప్రముఖ కవి గుర్రం జాషువా 127వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు

 ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు

 గవర్నర్‌పేట, సెప్టెంబరు 28: డెమోక్రటిక్‌ పీఆర్‌టీ యూ-ఏపీ, కలపాల నీలిమాదేవి మెమో రియల్‌ ట్రస్ట్‌ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం ఎంజీ రోడ్డులోని ఠాగూర్‌ స్మారక గ్రంథాలయంలో ప్రముఖ కవి గుర్రం జాషువా 127వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాషువా చిత్రపటానికి  పూలమాల వేసి నివాళులర్పించారు. కృష్ణా-గుంటూరు ఉమ్మడి జిల్లాల టీచర్స్‌ ఎమ్మెల్సీ కల్పలతరెడ్డి, తెలంగాణా మాజీ ఎమ్మెల్సీ మోహనరెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ డైరెక్టర్‌ దేవానందరెడ్డి, డెమోక్రటిక్‌ పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌, జనరల్‌ సెక్రటరీ పి. వెంకటేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు పెరుమాళ్లు, సంఘ నాయకులు జోజి, నాగేంద్ర, జ్ఞానేశ్వర్‌, బాలసుందర్‌, జమలయ్య, మర్రి ప్రభాకర్‌, డాక్టర్‌ సత్యవతి, నీలిమాదేవి ట్రస్ట్‌ చైర్మన్‌ అబ్రహాం లింకన్‌ పాల్గొన్నారు.

మొగల్రాజపురం: పీబీ సిద్ధార్థ కళాశాల తెలుగు శాఖ ఆధ్వర్యంలో కళాశాలలో గుర్రం జాషువా జయంతిని నిర్వహించారు. ప్రిన్సిపల్‌ డాక్టర్‌ మేకా రమేష్‌  ముందుగా ఆయన చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.

 డైరెక్టర్‌ వేమూరి బాబురావు, డీన్‌ రాజేష్‌,  తెలుగు శాఖ సహాయక ఆచార్యులు  డాక్టర్‌ ఎన్‌. శివకుమార్‌,  డాక్టర్‌ నీరజ, జూనియర్‌ లిటరరీ యాక్టివ్‌ కమిటీ అధ్యక్షులు డాక్టర్‌  కె. శాంతకుమారి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-29T06:39:09+05:30 IST