గ్రామాల అభివృద్ధితోనే ప్రగతి

ABN , First Publish Date - 2022-12-13T01:33:30+05:30 IST

గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎంపీపీ అనగాని రవి అన్నారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో గ్రామ పంచాయతీల అభివృద్ధి ప్రణాళిక (జీపీడీపీ) పై సోమవారం అల్లాపురం, అజ్జంపూడి, బూతిమిల్లిపాడు, బీబీగూడెం, చిక్కవరం సర్పంచ్‌లు, కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది, తదితర అధికారులకు శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది.

 గ్రామాల అభివృద్ధితోనే ప్రగతి
మాట్లాడుతున్న ఎంపీపీ అనగాని రవి

గన్నవరం, డిసెంబరు 12 : గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎంపీపీ అనగాని రవి అన్నారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో గ్రామ పంచాయతీల అభివృద్ధి ప్రణాళిక (జీపీడీపీ) పై సోమవారం అల్లాపురం, అజ్జంపూడి, బూతిమిల్లిపాడు, బీబీగూడెం, చిక్కవరం సర్పంచ్‌లు, కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది, తదితర అధికారులకు శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఎంపీపీ అనగాని రవి మాట్లాడు తూ, అందరూ సమష్టిగా ఉండి పని చేస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు. జడ్పీటీసీ సభ్యురాలు అన్నవరపు ఎలిజబెత్‌ రాణి, ఎంపీడీవో కె.వెంకటేశ్వరరావు, శిక్షకుడు కోటేశ్వరరావు పాల్గొన్నారు.

పెనమలూరు : గ్రామ పంచాయతీల అభివృద్ధి ప్రణాళికపై స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం నుంచి రెండు రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో సునీతాశర్మ తెలిపారు. ఈ శిక్షణా తరగతులలో వివిధ గ్రామాలలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, లైన్‌ డిపార్టుమెంటల్‌ అధికారులు, సచివాలయ సిబ్బంది హాజరుకావాలని కోరారు.

Updated Date - 2022-12-13T01:33:30+05:30 IST

Read more