ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ వైఫల్యం

ABN , First Publish Date - 2022-12-10T01:26:09+05:30 IST

ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయ డంలో ప్రభుత్వం, అధికార యంత్రాంగం పూర్తి వైఫల్యం చెందిందని టీడీపీ అవనిగడ్డ నియోజకవర్గ ప్రతినిధులు ఆరోపించారు. శుక్రవారం మోపిదేవి మండలంలోని వెంకటాపురం, శివరామపురం, పెదకళ్లేపల్లి, బోడగుంట గ్రామాల్లో పర్యటించి కొనుగోళ్లు లేక రహదారుల వెంబడి నిల్వ ఉంచిన ధాన్యం రాశులను పరిశీలించారు.

ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ వైఫల్యం
టార్పాలిన్లు లేకపోవడంతో అన్నవరం సమీపంలోని ధాన్యం రాశిపై చీరలు కప్పుతున్న రైతు, పరిశీలిస్తున్న టీడీపీ బృందం

మోపిదేవి మండలంలో రాశులను పరిశీలించిన టీడీపీ బృందం

ధాన్యం కొనుగోలులో ఆంక్షలపై రైతుల ఆవేదన

మోపిదేవి, డిసెంబరు 9: ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయ డంలో ప్రభుత్వం, అధికార యంత్రాంగం పూర్తి వైఫల్యం చెందిందని టీడీపీ అవనిగడ్డ నియోజకవర్గ ప్రతినిధులు ఆరోపించారు. శుక్రవారం మోపిదేవి మండలంలోని వెంకటాపురం, శివరామపురం, పెదకళ్లేపల్లి, బోడగుంట గ్రామాల్లో పర్యటించి కొనుగోళ్లు లేక రహదారుల వెంబడి నిల్వ ఉంచిన ధాన్యం రాశులను పరిశీలించారు. టార్పాలిన్లు, పరదాలు దొరక్కపోవటంతో ధాన్యం తడవకుండా చీరలను రాశులపై కప్పుకోవా ల్సిన దుస్థితి దాపురించిందని రైతులు తెలిపారు. వారం రోజులుగా ధాన్యాన్ని ఆరబోసుకునేందుకు పట్టాలకు వేలాది రూపాయల అద్దెలు చెల్లిస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆంక్షల కారణంగా పండించిన ధాన్యాన్ని స్వేచ్ఛగా అమ్ముకోలేకపోతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్బీకేల చుట్టూ రోజుల తరబడి తిరిగినా గోనె సంచులు ఇవ్వలేదని శివరామ పురం, అన్నవరం రైతులు ఆరోపించారు. రాయితీపై టార్పాలిన్లు ఇవ్వక పోవడం ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనమని టీడీపీ నేతలు అన్నారు. సరిపడా గోనె సంచులు, హమాలీలు ఏర్పాటు చేసి 24 గంటల్లోగా ధాన్యాన్ని మిల్లులకు చేర్చాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి కొల్లూరి వెంకటేశ్వరరావు, బావిరెడ్డి వెంకటేశ్వరరావు, నడకుదుటి జనార్దనరావు, రావి రత్నగిరి పాల్గొన్నారు.

తహసీల్దార్‌ దృష్టికి సమస్యలు

మోపిదేవి మండలంలో ఆయా గ్రామాల్లో వరి నూర్పిడి చేసి కొను గోలు సరిగా లేక రైతులు పడుతున్న ఇబ్బందులు, సమస్యలను రెండు రోజులుగా టీడీపీ బృంద సభ్యులు పరిశీలించారు. సమస్యలను మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ తహసీల్దార్‌ దృష్టికి తీసుకెళ్లారు. వెంకటాపురం, మోపిదేవి, అన్నవరం, పెదకళ్లేపల్లి, శివరామపురం గ్రామాల్లో రైతులకు ధాన్యం నిల్వ చేసుకునేందుకు గోనె సంచులు అందుబాటులో ఉండటం లేదని, రైతులకు నష్టం వాటిల్లకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఆన్‌లైన్‌ విధానాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేసి ఆఫ్‌లైన్‌ ద్వారా ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తు న్నామని, 24 గంటల్లో రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని బుద్ధప్రసాద్‌కు తహసీల్దార్‌ వివరించారు.

ప్రతి గింజా కొనాల్సిందే: జనసేన

అవనిగడ్డ టౌన్‌: అవనిగడ్డ నియోజకవర్గంలో ధాన్యపు రాశులు వద్ద రైతులు అల్లాడిపోతున్నారని, తేమశాతంతో సంబంధం లేకుండా ప్రభు త్వం ప్రకటించిన మద్దతు ధరకే ప్రతి గింజా కొనాల్సిందేనని విలేకరుల సమావేశంలో జనసేన మండల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యే చొరవ చూపాలన్నారు. గుడివాక శేషుబాబు, బొప్పన భాను, మండలి శివప్రసాద్‌, పప్పుశెట్టి గోపినాథ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-10T01:26:09+05:30 IST