రైతులను నట్టేట ముంచిన వైసీ ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-12-13T01:11:17+05:30 IST

ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఆదుకోకుండా రైతులను వైసీపీ ప్రభుత్వం నట్టేట ముంచిందని మచిలీపట్నం పార్లమెం టు తెలుగు రైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ ధ్వజమెత్తారు

 రైతులను  నట్టేట   ముంచిన వైసీ ప్రభుత్వం

మచిలీపట్నం టౌన్‌ : ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఆదుకోకుండా రైతులను వైసీపీ ప్రభుత్వం నట్టేట ముంచిందని మచిలీపట్నం పార్లమెం టు తెలుగు రైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ ధ్వజమెత్తారు. మంగినపూడి గ్రామంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికీ తిరిగి రైతుల సమస్యలు తెలు సుకున్నారు. రైతు నాయకులు మెండు భానుమూ ర్తి, చేబోయిన సత్యనారాయణ, గోవాడ రమేష్‌, వన్నెంరెడ్డి బాబురావు, వన్నెంరెడ్డి సత్యనారాయణ, భట్రాజు పాండురంగారావు, కొండేటి సత్యనారాయణ, టి. నాగేంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-13T01:11:17+05:30 IST

Read more