వీర నేతాజీ మృతి తీరని లోటు : గిడుగు

ABN , First Publish Date - 2022-12-13T01:15:38+05:30 IST

పీసీసీ మాజీ సభ్యుడు, సీనియర్‌ నేత గానుగుల వీర నేతాజీ మృతి కాంగ్రెస్‌ పార్టీకి తీరని లోటని ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అన్నారు.

  వీర నేతాజీ మృతి తీరని లోటు : గిడుగు

గుడివాడ టౌన్‌ : పీసీసీ మాజీ సభ్యుడు, సీనియర్‌ నేత గానుగుల వీర నేతాజీ మృతి కాంగ్రెస్‌ పార్టీకి తీరని లోటని ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అన్నారు. గానుగుల మృతదేహాన్ని సోమవారం ఆ యన సందర్శించి పార్టీ కండువా కప్పి నివాళులర్పించారు. నేతాజీ లాంటి నిబద్ధత గల నాయకుడిని కోల్పోవడం బాధాకరమన్నారు. మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్‌, నాయకులు లాం తాంతియా కుమారి, సుంకర పద్మశ్రీ తదితరులు నేతాజీ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.

Updated Date - 2022-12-13T01:15:38+05:30 IST

Read more