విద్యార్థుల్లో సృజనాత్మకత అవసరం

ABN , First Publish Date - 2022-11-25T02:21:57+05:30 IST

విద్యార్థుల్లో సృజనాత్మకత, వినూత్న ఆలోచనలు ఉత్తేజ పరిచేందుకు టాలెంట్‌ హంట్‌ (తృష్ణ-2022) వంటి పోటీలు ఎంతో అవసరమని ఏపీ మినిస్టిరీస్‌ ఆఫ్‌ కమ్యూనికేషన్స్‌ సైబర్‌ సెక్యూరిటీ డైరెక్టర్‌ జీవీ మనోజ్‌కుమార్‌ అన్నారు.

విద్యార్థుల్లో సృజనాత్మకత అవసరం

గుడ్లవల్లేరు, నవంబరు 24 : విద్యార్థుల్లో సృజనాత్మకత, వినూత్న ఆలోచనలు ఉత్తేజ పరిచేందుకు టాలెంట్‌ హంట్‌ (తృష్ణ-2022) వంటి పోటీలు ఎంతో అవసరమని ఏపీ మినిస్టిరీస్‌ ఆఫ్‌ కమ్యూనికేషన్స్‌ సైబర్‌ సెక్యూరిటీ డైరెక్టర్‌ జీవీ మనోజ్‌కుమార్‌ అన్నారు. గురువారం స్థానిక శేషాద్రిరావు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్‌ కళాశాలలో ఐఈఈఈ స్టూడెంట్స్‌ టాలెంట్‌ హంట్‌(తృష్ణ2022) కార్యక్రమాన్ని మనోజ్‌ కుమార్‌ ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రారంభించారు. మానవ జీవన విధానంలో అంతర్‌జాల ప్రాముఖ్యత, కమ్యూనికేషన్‌ వినియోగం పెరిగిపోయిందన్నారు. 5జి, ఎం టూ ఎం కమ్యూనికేషన్స్‌, కృత్రిమ మేధస్సుల గురించి ఆయన విద్యార్థులకు వివరించారు. తొలుత శేషాద్రిరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు క్విజ్‌, పోస్టర్‌ ప్రజంటేషన్‌, పేపర్‌ ప్రజంటేషన్‌, సాంస్కృతిక పోటీల్లో పాల్గొన్నారని కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ ఎం.కామరాజు తెలిపారు.ప్రిన్సిపాల్‌ ప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.న్నారు.

Updated Date - 2022-11-25T02:21:58+05:30 IST