గ్యాస్‌పైపు లీకై మంటలు

ABN , First Publish Date - 2022-08-01T06:27:11+05:30 IST

గ్యాస్‌పైపు లీకై మంటలు

గ్యాస్‌పైపు లీకై మంటలు

అవనిగడ్డ టౌన్‌, జూలై 31 : అవనిగడ్డలో ఇంటింటికీ నేరుగా గ్యాస్‌ సరఫరా చేసే పైపులైన్‌ లీక్‌ కావటంతో మండలిపురంలో ఆదివారం మంటలు వ్యాపించాయి. గ్రామంలోని ఓ డ్రెయినేజీలో ఆదివారం ఉదయం ఒక్కసారి బుడగలు వచ్చి వెంటనే మంటలు వ్యాపించాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. డ్రెయినేజీ కింద మెగా కంపెనీ ఏర్పాటుచేసిన గ్యాస్‌ పైపులైన్‌ కారణంగానే మంటలు వ్యాపించాయని తెలిసి ఓఎన్‌జీసీ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి మంటలను అదుపు చేశారు. గ్యాస్‌ లీకేజీని సరిచేశారు. గతంలోనూ అవనిగడ్డ ప్రాంతంలో రెండుచోట్ల ఇదే రీతిన గ్యాస్‌ లీకై మంటలు వ్యాప్తి చెందాయి.

Read more