దసరా మహోత్సవాలు ప్రారంభం

ABN , First Publish Date - 2022-09-27T06:44:37+05:30 IST

ఉయ్యూరు పట్టణ, మండల పరిధి గ్రామాల్లో దసరా మహో త్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. శరన్నవ రాత్రి ఉత్సవాల్లో మొదటి రోజైన సోమవారం అమ్మ వారికి ప్రత్యేక పూజలు అలంకరణ చేశారు.

దసరా మహోత్సవాలు ప్రారంభం

ఉయ్యూరు శివాలయంలో సామూహిక కుంకుమార్చన

ఉయ్యూరు, సెప్టెంబరు 26 : ఉయ్యూరు పట్టణ, మండల పరిధి గ్రామాల్లో దసరా మహో త్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. శరన్నవ రాత్రి ఉత్సవాల్లో మొదటి రోజైన సోమవారం అమ్మ వారికి ప్రత్యేక పూజలు అలంకరణ చేశారు. ఉయ్యూరు సోమేశ్వరస్వామి ఆలయంలో స్వర్ణకవచ లాంకృత జగ దాంబగా అమ్మవారిని అలంకరించారు. ఈ సందర్భం గా నిర్వహించిన ప్రత్యేక పూజ, సామూహిక కుంకు మార్చనలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్‌ సీహెచ్‌ వీవీ కుటుంబరాజు, సభ్యులు,  జంపాన కొండలరావు పాల్గొన్నారు.  ఆలయ ప్రాంగణంలో శ్రీ శ్రీనివాస విద్యా సంస్థల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. 

  శ్రీ గణపతి సచిదానంద జ్ఞానబోధ సభ ఆవరణలో దేవిశరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభ మయ్యాయి. అమ్మవారికి అభిషేకం, సహస్రనామ అర్చన, గౌరీపూజ, నవగ్రహ హోమం, కుంకుమార్చన చేశారు. ట్రస్టు చైర్మన్‌ నాదెళ్ల మంజులాదేవి, పీ ఆర్వో పి.నారాయణమూర్తి పలువురు భక్తులు  పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. 

హనుమాన్‌జంక్షన్‌ : శ్రీలక్ష్మీవెంకటేశ్వరస్వామి దేవస్థానంలో దసరా మహోత్సవాలను పురస్కరిం చుకుని సోమవారం అమ్మవారిని మహాలక్ష్మీదేవిగా అలంకరించారు. అమ్మవారికి ఆలయ ట్రస్టీ కాకాని అరుణబాబు దంపతులు నూతన వస్ర్తాలు అంద జేశారు. ఆలయ అర్చకులు చక్రావధానుల సీతారామా చార్యులు పూజా కార్యక్రమాలు నిర్వహించి  తీర్ధ ప్రసా దాలు అందజేశారు.  స్థానిక పోలీస్‌స్టేషన్‌లో దుర్గాదేవి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్టేషన్‌ రైటర్‌ ఇంకొల్లు సుబ్బారావు దంపతులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌ :  దసరా శరన్నవ రాత్రుల ఉత్సవాలు బాపులపాడు మండల వ్యాప్తంగా వివిధ గ్రామాల్లో వైభవంగా ప్రాంరంభించారు. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు సోమవారం దుర్గాదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. వీరవల్లి కనకదుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మోర్ల రామాంజ నేయులు దంపతులు అమ్మవారికి వెండి కలశం, భాస్కరాచారి  వెండి పాదాలు సమర్పించారు. అర్చకులు కుందుర్తి మురళి పర్యవేక్షణలో సహస్ర కుంకుమార్చన నిర్వహించారు.   కోడూరుపాడు గ్రామ యూత్‌ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పందిరిలో అమ్మవారిని దుర్గాదేవిగా అలంకరించారు. వీరవల్లి షిరిడి సాయి బాబా మందిరంలో ఏర్పాటు చేసిన అమ్మవారికి ఆల య కమిటీ ఆధ్వర్యంలో పట్టువస్త్రాలు సమర్పించి అర్చకులు శ్రీనివాసరావు పర్యవేక్షణలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రావి ఈశ్వర్‌, కోడె బోయిన బాబి, తవ్వా ఆదిలక్ష్మి పాల్గొన్నారు. 

మల్లవల్లిలో టీడీపీ నాయకుడు యనమదల వెంక య్యారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా అమ్మవారిని అలంకరించారు. అర్చకుల ఆధ్వర్యంలో కలశస్థాపన, అఖండ దీపారాధనతో పాటు సహస్రనామ కుంకు మార్చన ప్రత్యేక పూజలు నిర్వహించారు.   కొత్తపల్లి, రేమల్లె, తదితర గ్రామాల్లో గ్రామ కమిటీల ఆధ్వర్యంలో ప్రత్యేక పందిళ్లు ఏర్పాటు చేసి దసరా శరన్నవరాత్రులు వైభవంగా నిర్వహిస్తున్నారు. 

గన్నవరం : శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు మండలంలో అత్యంత వైభవంగా సోమవారం ప్రారం భమయ్యాయి. స్థానిక శ్రీలక్ష్మీ తిరుపతమ్మ ఆలయంలో శ్రీ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. తొలుత గోపూజతో నవ రాత్రులను ప్రారంభించారు. జాస్తి ఫణిశేఖర్‌, శ్రీవాణి, కాసరనేని బాబూరావు, బేబి సరోజిని, నర్రా గిరిధర్‌, సౌభాగ్యలక్ష్మి దంపతులచే కలశ స్థాపన జరిపారు. మహిళా భక్తులు లలిత సహస్త్రనామ పారాయణం, శ్రీ దుర్గ అష్టోత్తర పారాయణం చేశారు.  మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ దాసరి వెంకట బాలవర్ధనరావు వైస్‌ ఎంపీపీ కొమ్మరాజు సుధీర్‌, పీఏసీఎస్‌ అధ్యక్షురాలు కాసరనేని పద్మ ప్రియ, ఆలయ కమిటీ అధ్యక్షులు జాస్తి శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఉంగుటూరు  :  దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం మండల వ్యాప్తంగా వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు బాలాత్రిపురసుందరీదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. పెదఅవుటపల్లి విశ్వేశ్వరస్వామి దేవస్ధానంలో నిర్వహించిన ప్రత్యేక పూజాకార్యక్రమాల్లో గ్రామపెద్దలు వేగే విష్ణుపూర్ణచంద్రరావు దంపతులు పాల్గొన్నారు. ఆత్కూరు శ్రీచంద్రమౌళేశ్వరస్వామి, ఇందుపల్లి శ్రీచంద్రశేఖరస్వామి, తేలప్రోలు శ్రీవిశ్వేశ్వరస్వామి, మానికొండ శ్రీమల్లికార్జునస్వామి దేవాలయాలతోపాటు తరిగొప్పల, పొణుకుమాడు, ఎలుకపాడు, లంకపల్లి, తదితర గ్రామాల్లోని శివాలయాల్లో అమ్మవారు ప్రత్యేక అలంకారాల్లో భక్తులకు దర్శనమిచ్చారు.  

Read more