గాంధీజీ బోధనలే శాంతికి బలమైన సిద్ధాంతాలు

ABN , First Publish Date - 2022-10-03T06:30:04+05:30 IST

గాంధీజీ బోధించిన స త్యం, అహింసామార్గాలు శాంతికి బలమైన సిద్ధాంతాలని కలెక్టర్‌ ఎస్‌.దిల్లీరావు అన్నారు.

గాంధీజీ బోధనలే శాంతికి బలమైన సిద్ధాంతాలు

కలెక్టర్‌ దిల్లీరావు

పటమట, అక్టోబరు 2 : గాంధీజీ బోధించిన స త్యం, అహింసామార్గాలు శాంతికి బలమైన సిద్ధాంతాలని కలెక్టర్‌ ఎస్‌.దిల్లీరావు అన్నారు. నగరంలోని బెం జిసర్కిల్‌ నాస్తిక కేంద్రంలోని ఆదివారం ఆధునీకరించిన బాపు ప్రదర్శననలు కలెక్టర్‌ దిల్లీరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతివ్యక్తికి ఆత్మగౌరవం, గుర్తింపు ఉండాలని, మానవులంతా ఒక్కటే అనేది గాంధీ సిద్ధాంతమని వివరించా రు. బాపు ప్రదర్శనలో ఏర్పాటు చేసిన ఛాయాచిత్రా లు అన్ని కళ్లకు కట్టినట్టు ఉన్నాయన్నారు. జిల్లాలోని కాలేజీ, హైస్కూల్‌ విద్యార్థులు తప్పనిసరిగా బాపు ప్రదర్శనను సందర్శించి, దేశ నిర్మాణంలో భాగస్వామ్యులు కావాలన్నారు. రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా చైర్మన్‌ డాక్టర్‌ సమరం, చెన్నుపాటి వజీర్‌, సిద్ధార్థ ఫార్మశీ కళాశాల ప్రిన్సిపాల్‌ సునీత లక్ష్మీ పాల్గొన్నారు. 

కలెక్టరేట్‌లో...

జాతిపిత మహాత్మాగాంఽధీజీ 153వ జయంతి సందర్భంగా నగరంలోని కలెక్టర్‌ కార్యాలయంలో ఆదివారం కలెక్టర్‌ ఎస్‌.దిల్లీరావు గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీజీ ప్రవచించిన శాంతి, అహింస మార్గాలను ప్రతి ఒక్కరూ అనుసరించాలన్నారు. గాంధీజీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు. 

నేడు స్పందన రద్దు

ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందనను సోమవారం రద్దు చేస్తున్నట్టు కలెక్టర్‌ ఎస్‌. దిల్లీరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలోని ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో జిల్లా, డివిజన్‌ మండ ల స్థాయి అధికారులతో పాటు అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన సిబ్బందికి విధులు కేటాయించడం జరిగిందని వారు తమకు కేటాయించిన విధులకు సోమవారం నుంచి హాజరు కావాల్సి ఉన్నందున స్పందనను తాత్కాలికంగా రద్దు చేసినట్లు పేర్కొన్నారు. 

Read more