ఘనంగా వీఎం రంగా జయంతి

ABN , First Publish Date - 2022-07-05T06:56:52+05:30 IST

ఘనంగా వీఎం రంగా జయంతి

ఘనంగా వీఎం రంగా జయంతి

 పెనమలూరు, జూలై 4: వంగవీటి రంగా జయంతి సందర్భంగా సోమవారం యనమలకుదురులో ఘనంగా వేడుకలను నిర్వహిం చారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన  మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ కేకును కత్తిరించి వేడుకలను ప్రారంభించారు. కార్యక్రమంలో   పాదాల ప్రభాకర్‌, ధనేకుల రాజేష్‌, పత్తిపాటి వెంకటేష్‌, డి. భార్గవ్‌, లంకా కృష్ణారావు, కమ్మిలి నాగేశ్వరరావు పాల్గొన్నారు.

కంకిపాడు : మండలంలోని వివిధ గ్రామాల్లో సోమవారం వీఎం రంగా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కంకిపాడులో నిర్వహిం చిన ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు ముప్పా రాజా, బోయిన నాగరాజు, పిచుక క్రాంతి, సుంకర సురేష్‌, కుంటా గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.  స్థానిక బస్టాండ్‌ సెంటర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు. మాదాసువారిపాలెంలో నిర్వహించిన కార్యక్రమంలో  కొప్పరాజు సురేష్‌, తోట సతీష్‌ తదితరులు పాల్గొన్నారు. 

హనుమాన్‌జంక్షన్‌ : హనుమాన్‌జంక్షన్‌లోని ఇందిరానగర్‌లో రంగా మిత్రమండలి నాయకులు గంధం రామారావు ఆధ్వర్యంలో వంగవీటి రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాపులపాడు ఎంపీపీ వై.నగేష్‌, వైసీపీ నక్కా గాంధీ, యర్రంశెట్టి రామాంజనేయులు, గంధం నారాయణ, వరిగంజి కిషోర్‌, వడ్డి గిరిధర్‌, గుడిసే రాజు తదితరులు పాల్గొన్నారు.

ఉంగుటూరు : పేదల అభ్యున్నతికి, బడుగు, బలహీన వర్గాల సమస్యల పరిష్కారానికి ఎనలేని కృషిచేసిన స్వర్గీయ వంగవీటి మోహనరంగా అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని ఎస్‌ఎ్‌ఫఐ గన్నవరం నియోజకవర్గ కార్యదర్శి చిల్లర రాజేష్‌ అన్నారు. ఉంగుటూరు మండలం నాగవరప్పాడు గ్రామంలో నాయుడూస్‌ యూత్‌ ఆధ్వర్యంలో రంగా 75వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రంగా చిత్రపటానికి పూలమాలలవేసి నివాళులర్పించారు. అనంతరం కేక్‌ కట్‌చేసి అభిమానులకు పంచిపెట్టారు.   ఈ కార్యక్రమంలో పి.జస్వంత్‌, పి.లోకేష్‌, బి.రవి పాల్గొన్నారు.

Read more