వీకేఆర్‌లో ముగిసిన ఆటల పోటీలు

ABN , First Publish Date - 2022-01-23T05:56:48+05:30 IST

వీకేఆర్‌ అండ్‌ వీఎన్‌బీ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఈ నెల 19న ప్రారంభమైన వేములపల్లి వెంకటేశ్వరరావు మెమోరియల్‌ వీకేఆర్‌ ప్రీమియం లీగ్‌ పోటీలు శనివారంతో ముగిశాయి.

వీకేఆర్‌లో ముగిసిన ఆటల పోటీలు
విజేతలకు బహుమతులు అందజేస్తున్న నిర్వాహకులు

గుడివాడ టౌన్‌ : వీకేఆర్‌ అండ్‌ వీఎన్‌బీ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఈ నెల 19న ప్రారంభమైన వేములపల్లి వెంకటేశ్వరరావు మెమోరియల్‌ వీకేఆర్‌ ప్రీమియం లీగ్‌ పోటీలు శనివారంతో ముగిశాయి. జిల్లాలోని 12 ఇంటర్‌ కళాశాల విద్యార్థులు క్రికెట్‌, కబడ్డీ పోటీల్లో పాల్గొన్నారు. ఉత్కఠగా మూడు రోజులపాటు జరిగిన పోటీల్లో బాలుర క్రికెట్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో ఎస్‌సీఎస్‌ జూనియర్‌ కళాశాల కానుమోలు, నారాయణ జూనియర్‌ కళాశాల గుడివాడ తలపడగా ఎస్‌సీఎస్‌ జూనియర్‌ కళాశాల జట్టు నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించగా, రోలింగ్‌ షీల్డ్‌ను వీకేఆర్‌వీఎన్‌బీ మేనేజ్‌మెంట్‌ అందజేసింది. ఎస్‌సీఎస్‌ విద్యార్థి మణికంఠ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ గెలుచుకోగా, మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ను అజయ్‌ గెలుచుకున్నారు.  బాలికల కబడ్డీ పోటీల్లో ఫైనల్స్‌ ఏజీఅండ్‌ఎస్‌జీఎస్‌ కళాశాల ఉయ్యూరు, ఏఆర్‌ జూనియర్‌ కళాశాల ముదినేపల్లితో తలపడగా ఏజీఅండ్‌ఏజీఎస్‌ కళాశాల జట్టు గెలుపొందింది.  ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ టైటిల్‌ని బి.ధనలక్ష్మి కైవసం చేసుకోగా, ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌గా వీఆర్‌ జూనియర్‌ కళాశాల ముదినేపల్లి విద్యార్థిని టి.పరిపూర్ణ దక్కించుకుంది.  బహుమతి ప్రధానోత్సవంలో కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్‌ వేములపల్లి కోదండరామయ్య, డైరెక్టర్‌ బి.కళ్యాణ్‌కుమార్‌, ప్రిన్సిపాల్‌  ప్రసాద్‌రావు, లీగ్‌ కో ఆర్డినేటర్‌ గంజి వెంకటరత్నం, ఎస్‌.శ్రీధర్‌, కె.హరికిషన్‌, పిజికల్‌ డైరెక్టర్లు కె.చింతయ్య, జి.వి.వి.బ్రహ్మం, టి.వినోద్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 


Read more