నష్టపరిహారం చెల్లించండి

ABN , First Publish Date - 2022-11-25T00:52:06+05:30 IST

విజయవాడ వెస్ట్‌ రన్‌ బైపాస్‌ ఫేస్‌-3 నిర్మాణంలో భాగంగా నష్టపోతున్న రైతులకు పారదర్శకంగా నష్టపరిహారం చెల్లించాలని బాధిత రైతులు డి మాండ్‌ చేశారు.

నష్టపరిహారం చెల్లించండి

విజయవాడ రూరల్‌, నవంబరు 24 : విజయవాడ వెస్ట్‌ రన్‌ బైపాస్‌ ఫేస్‌-3 నిర్మాణంలో భాగంగా నష్టపోతున్న రైతులకు పారదర్శకంగా నష్టపరిహారం చెల్లించాలని బాధిత రైతులు డి మాండ్‌ చేశారు. చిన్న అవుటపల్లి నుంచి మంగళగిరి వరకు బైపాస్‌ రహదారి నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న విద్యుత్‌ హైటెన్షన్‌ వైర్ల మార్పుపై రైతులకు ఎలాంటి నోటీసులివ్వకుండా విద్యుత్‌ హైటన్షన్‌ వైర్ల మార్పులను నిరసిస్తూ గొల్లపూడి, నున్న, కండ్రిక, పాతపాడు, జక్కంపూడి గ్రామాల్లోని రైతులు గురువారం కుందావారి కండ్రిక వ ద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ జీవో నెం.275 పరిగణలోకి తీసుకోకుం డా ఎన్‌హెచ్‌ఏఐ, మెగా ఇంజనీరింగ్‌ సంస్థలు రైతులను మోసం చేయడానికి యత్నిస్తున్నారన్నారు. మెగా ఇంజనీరింగ్‌ సంస్థకు హైటెన్షన్‌ వె ౖర్ల మార్పునకు సంబంధించిన కాంట్రాక్ట్‌ అప్పగించిన ప్రభుత్వం తమ విలువైన భూములు నష్టపోతున్న రైతుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకుండా వారి మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఆగహ్రం వ్యక్తం చేశారు. రైతుల భూముల్లోకి అన్యాయంగా ప్రవేశించి హైటెన్షన్‌ వైర్ల మార్పునకు చర్యలు తీసుకోవడం దారుణమైన చర్య అని అన్నారు. ఎవరి భూముల్లో అయితే హైటెన్షన్‌ వైర్లు వస్తున్నాయో వారి వివరాలను పొందుపరిచే జాబితా లేకుండా సంబంధిత అధికారుల ద్వారా నష్టపరిహారం చెల్లిస్తామని చెబుతున్నారని మండిపడ్డారు. రైతులకు ముందుగా నోటీసులు అందజేసి 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపోతున్న రైతులకు చెల్లింపులు జరగాలని కోరారు. రైతులు అల్లూరి సత్యనారాయణ, నిమ్మగడ్డ శివజోగేశ్వరరావు, పొన్నం శ్రీనివాసరావు, నూతలపాటి శివరామకృష్ణ పాల్గొన్నారు.

Updated Date - 2022-11-25T00:52:07+05:30 IST