ఎయిర్‌పోర్టులో ఫాస్టాగ్
ABN , First Publish Date - 2022-12-30T01:05:07+05:30 IST
ప్రయాణికుల సమయాన్ని వృథా కాకుండా ఉండేందుకు ఫాస్ట్ ట్యాగ్‌ను ఏర్పాటు చేసినట్టు ఇన్‌చార్జి ఎయిర్‌పోర్టు డైరెక్టర్ పీవీ రామారావు అన్నారు.

గన్నవరం, డిసెంబరు 29 : ప్రయాణికుల సమయాన్ని వృథా కాకుండా ఉండేందుకు ఫాస్ట్ ట్యాగ్‌ను ఏర్పాటు చేసినట్టు ఇన్‌చార్జి ఎయిర్‌పోర్టు డైరెక్టర్ పీవీ రామారావు అన్నారు. గన్నవరం విమానాశ్రయంలోని టోల్‌గేట్ వద్ద వాహనాలకు ఫాస్ట్ ట్యాగ్‌ను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ ఇప్పటి వరకూ టోల్‌గేట్ వద్ద టికెట్ సిస్టం ఉండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. టికెట్ ఇచ్చి తీసుకునే సమయంలో వాహనాలు నిలిచిపోతున్నాయని దీంతో ప్రయాణికులు టెన్షన్‌కు గురవుతున్నారన్నారు. దీంతో ఫాస్ట్ ట్యాగ్‌ను పెట్టాల్సి వచ్చిందన్నారు. దీంతో సమయం వృథా కాదన్నారు. విమానాశ్రయానికి వచ్చే వాహనాలకు ఫాస్ట్‌ట్యాగ్ ఉంటే టోల్‌గేట్ దగ్గర ఆపే పనిలేకుండా రాకపోకలు సాగించవచ్చన్నారు. ఫాస్ట్ ట్యాగ్ రీచార్జ్ లేకపోయిన టికెట్ కూడా తీసుకోవచ్చన్నారు. డీఎస్పీ వెంకటరత్నం, సీఆర్‌పీఎఫ్ ఏఎస్పీ పి.సత్యం, మన్నే వెంకట లక్ష్మోజి, విమానాశ్రయ సిబ్బంది పాల్గొన్నారు.
Read more