అన్ని జిల్లాల్లో ఐ బ్యాంకులు ఏర్పాటు చేస్తాం: రెడ్‌క్రాస్‌ రాష్ట్ర చైర్మన్‌ డాక్టర్‌ శ్రీధర్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-03-16T06:45:02+05:30 IST

అన్ని జిల్లాల్లో ఐ బ్యాంకులు ఏర్పాటు చేస్తాం: రెడ్‌క్రాస్‌ రాష్ట్ర చైర్మన్‌ డాక్టర్‌ శ్రీధర్‌రెడ్డి

అన్ని జిల్లాల్లో ఐ బ్యాంకులు ఏర్పాటు చేస్తాం: రెడ్‌క్రాస్‌ రాష్ట్ర చైర్మన్‌ డాక్టర్‌ శ్రీధర్‌రెడ్డి

విజయవాడ సిటీ, మార్చి 15: రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రెడ్‌క్రాస్‌ తరఫన ఐ బ్యాంకులు స్థాపించబోతున్నట్టు రెడ్‌క్రాస్‌ రాష్ట్ర చైర్మన్‌ డాక్టర్‌ శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని బాలల సంరక్షణ కేంద్రాల్లోని పిల్లలకు రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు చేసేందుకు కళ్లజోళ్లు పంపిణీ చేసేందుకు ప్రముఖ కంటి ఆసుపత్రి ఎల్వీప్రసాద్‌ ఐ ఇన్సిట్యూట్‌తో ఒప్పదం కుదుర్చుకున్నట్టు చెప్పారు. ఈ నేపథ్యంలో ఒప్పంద పత్రాలపై రెడ్‌క్రాస్‌ కార్యాలయంలో ఇరువైపులా ప్రతినిధులు మంగళవారం సంతకాలు చేశారు. రెడ్‌క్రాస్‌ జనరల్‌ సెక్రటరీ ఏకే పరీడ, కో-ఆర్డినేటర్‌ బి.వి.ఎస్‌.కుమార్‌, రాష్ట్ర గవర్నర్‌ కార్యదర్శి బెహరా, రాష్ట్ర వైస్‌ చైర్మన్‌ జగన్మోహన్‌రావు, ఆసుపత్రి తరఫున జచిన్‌ విలియమ్స్‌, వాసుబాబు, సురేందర్‌ పాల్గొన్నారు.     

Read more