బాలశౌరి బహిరంగ క్షమాపణ చెప్పాలి: కొనకళ్ల నారాయణరావు

ABN , First Publish Date - 2022-06-12T19:04:19+05:30 IST

కృష్ణా జిల్లా: మచిలీపట్నం ఎంపీ బాలశౌరిపై టీడీపీ మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు ఫైర్ అయ్యారు. పేర్ని నాని, తనకు మధ్య సత్సంబంధాలు ఉన్నాయని బాలశౌరి చేసిన

బాలశౌరి బహిరంగ క్షమాపణ చెప్పాలి: కొనకళ్ల నారాయణరావు

కృష్ణా జిల్లా: మచిలీపట్నం ఎంపీ బాలశౌరిపై టీడీపీ మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు ఫైర్ అయ్యారు. పేర్ని నాని, తనకు మధ్య సత్సంబంధాలు ఉన్నాయని బాలశౌరి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో స్పందించారు. ఏ ఆధారంతో పేర్ని నానికి, తనకు సత్సంబంధాలు ఉన్నాయని బాలశౌరి ఆరోపించాడో సమాధానం చెప్పాలని కొనకళ్ల  డిమాండ్ చేశారు. పేర్ని నాని తనకు ఓ రాజకీయ ప్రత్యర్థి అని, ఆయనొక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారని, నేనొక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నానన్నారు. నా గురించి మాట్లాడే అర్హత బాలశౌరికి ఎవరిచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై నిరాధార వ్యాఖ్యలు చేసిన బాలశౌరి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Read more