ఉద్యోగులపై చిన్నచూపు తగదు

ABN , First Publish Date - 2022-11-30T01:11:13+05:30 IST

ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో కీలకపాత్ర పోషిస్తున్న ఉద్యోగులపై చిన్నచూపు తగదని, ఉద్యోగులు ప్రభుత్వంలో ఒక భాగమని భావించి వారి సమస్యలపై సానుకూలంగా స్పందించి పరిష్కరించాలని ఏపీ ఎన్జీవో అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్‌ తెలిపారు.

ఉద్యోగులపై చిన్నచూపు తగదు

ధర్నాచౌక్‌, నవంబరు 29 : ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో కీలకపాత్ర పోషిస్తున్న ఉద్యోగులపై చిన్నచూపు తగదని, ఉద్యోగులు ప్రభుత్వంలో ఒక భాగమని భావించి వారి సమస్యలపై సానుకూలంగా స్పందించి పరిష్కరించాలని ఏపీ ఎన్జీవో అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్‌ తెలిపారు. విజయవాడ నగరశాఖ సర్వసభ్య సమావేశం గాంధీనగర్‌లోని ఎన్జీవోహోంలో మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డీఏ, పీఆర్సీ బకాయిల చెల్లింపు, జీపీఎఫ్‌, ఇన్సూరెన్స్‌, సరెండర్‌ లీవ్‌ వంటి పెండింగ్‌ బిల్లుల చెల్లింపు, సీపీఎస్‌ రద్దు తదితర అనేక డిమాండ్లు ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో భాగమైన ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల పట్ల మంత్రులు చులకనగా మాట్లాడటం తగదన్నారు. అవసరమైతే కాళ్లు పట్టుకోవడం వంటి మాటలు ఆక్షేపణీయమన్నారు. వీటిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇటువంటి వాఖ్యలు ఉద్యోగులను తీవ్ర మనస్థాపానికి గురి చేశాయన్నారు. ఉద్యమాలను విజయవంతం చేయడంలో ఎన్జీవో నగర శాఖ, జిల్లా నాయకత్వంతో పాటు ముఖ్య భూమికను పోషిస్తుందన్నారు. మున్ముందు జరగబోయే కార్యచరణకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. నగరశాఖ అధ్యక్ష, కార్యదర్శులు జె.స్వ్వామి, కె.సంపత్‌కుమార్‌ మాట్లాడుతూ, గత మూడేళ్లుగా కార్యవర్గం చేపట్టిన కార్యక్రమాల ప్రగతి నివేదికను సమర్పించి, జమా ఖర్చులను వివరించారు.

Updated Date - 2022-11-30T01:11:13+05:30 IST

Read more