విద్యుత్‌ చౌర్యం నేరం

ABN , First Publish Date - 2022-10-08T05:59:06+05:30 IST

విద్యుత్‌ చౌర్యం సామాజిక నేరమని ఎవరైనా విద్యుత్‌ చౌర్యానికి పాల్పడితే చర్యలు తప్పవని విద్యుత్‌ శాఖ విజయవాడ రూరల్‌ డీఈఈ శ్రీనివాసరావు హెచ్చరించారు.

విద్యుత్‌ చౌర్యం నేరం
సమావేశంలో మాట్లాడుతున్న డీఈఈ శ్రీనివాసరావు

డీఈఈ శ్రీనివాసరావు

కంచికచర్ల రూరల్‌, అక్టోబరు 7: విద్యుత్‌ చౌర్యం సామాజిక నేరమని ఎవరైనా విద్యుత్‌ చౌర్యానికి పాల్పడితే చర్యలు తప్పవని విద్యుత్‌ శాఖ విజయవాడ రూరల్‌ డీఈఈ శ్రీనివాసరావు హెచ్చరించారు. మండలంలో శుక్రవారం విద్యుత్‌ శాఖాధికారులు సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడులు చేశారు. ఈ సందర్భంగా డీఈఈ మాట్లాడుతూ 48 బృందాలు చేసిన తనిఖీల్లో 3,203 సర్వీసులను తనిఖీ చేసి అపరాధ రుసుం కింద రూ.7.62 లక్షలను వసూలు చేశామన్నారు. విద్యుత్‌ చౌర్యం జరుగుతున్నట్లు తెలిస్తే 94408 12085కు సమాచారం అందించాలని కోరారు.  కార్యక్రమంలో ఏడీఈ నవీన్‌కుమార్‌, అకౌంట్స్‌ అధికారి నరసింహారావు, సిబ్బంది పాల్గొన్నారు. 


Read more