ఎన్నికల హామీలు నెరవేర్చాలి

ABN , First Publish Date - 2022-06-11T06:37:30+05:30 IST

ఎన్నికల హామీలు నెరవేర్చాలి

ఎన్నికల హామీలు నెరవేర్చాలి
తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న ఏపీటీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సోమేశ్వరమ్మ

ఏపీటీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సోమేశ్వరమ్మ

ఉయ్యూరు, జూన్‌ 10 : ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించటం బాధాకరమని ఏపీటీఎఫ్‌ రాష్ట్ర ఉపాఽధ్యక్షురాలు కేఎన్‌ సోమేశ్వరమ్మ అన్నారు. ఉయ్యూరు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ప్రభుత్వం ఇచ్చిన హామీ లను నెరవేర్చాలని కోరుతూ శుక్రవారం ఆందోళన చేశారు. ఈ సందర్భంగా సోమేశ్వరమ్మ మాట్లాడుతూ ఎన్నికల ముందుకు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీలు సీపీఎస్‌ రద్దు చేసి పాత పింఛన్‌ విధానాన్ని కొనసాగించాలన్నారు. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో భా గంగా ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ వంద రోజుల పోరు బాట నిర్వహిస్తుందన్నారు. అయినా ప్రభుత్వానికి చలనం లేకపోవడం సిగ్గుచేటన్నారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టు లన్నిటిని భర్తీ చేయాలని, పీఎఫ్‌, ఏపీజీఎల్‌ఈ, మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలని ప్రభుత్వా న్ని డిమాండ్‌ చేశారు. సెప్టెంబరు 7వ తేదీ వరకు నిర్వహించే పోరుబాట కార్యక్రమాన్ని విజయవతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు వి. సాంబశివరావు, ప్రధా న కార్యదర్శి వి. రామారావు, వి.రాధిక, శ్రీనివాసరావు, పి. శివా జీ,  కోటేశ్వరరావు, ఎం. శ్రీధర్‌, వెంకటేశ్వరరావు, సతీష్‌, కోటే శ్వరరావు, ఖాన్‌, లక్ష్మీ, మురళీమోహన్‌ పాల్గొన్నారు

Updated Date - 2022-06-11T06:37:30+05:30 IST