విద్యుత్‌ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి

ABN , First Publish Date - 2022-09-10T06:10:21+05:30 IST

విద్యుత్‌ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో 327 యూనియన్‌ ఎల్లప్పుడూ ముందుంటుందని ఏపీఎస్‌ఈఈ 327 కార్యదర్శి బెల్లంకొండ కృష్ణార్జునరావు అన్నారు.

విద్యుత్‌ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి

పెనుగంచిప్రోలు, సెప్టెంబరు 9: విద్యుత్‌ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో 327 యూనియన్‌ ఎల్లప్పుడూ ముందుంటుందని ఏపీఎస్‌ఈఈ 327 కార్యదర్శి బెల్లంకొండ కృష్ణార్జునరావు అన్నారు. యూనియన్‌ విజయవాడ రూరల్‌ డివిజన్‌ సర్వసభ్య సమావేశం సంఘం అధ్యక్షుడు ముసిబోయిన రామయ్య అధ్యక్షతన తంబరేణి ఫంక్షన్‌ హాల్లో శుక్రవారం జరిగింది.  గ్రామ సచివాలయాల్లో పని చేస్తున్న ఎనర్జీ అసిస్టెంట్లకు విద్యుత్‌ కార్మికులకు వచ్చే అన్ని రకాల సదుపాయాలను వర్తించే విధంగా కృషి చేస్తామన్నారు. కార్మికులకు పెరగాల్సిన జీతాలపై రాజీ లేని పోరాటం చేస్తామన్నారు. 1104 యూనియన్‌కు సంబంధించిన 34 మంది కార్మికులు 327 యూనియన్‌లో చేరినట్టు తెలిపారు.యూనియన్‌ డివిజన్‌ కార్యదర్శి అజ్మీర నాగేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి వై.ఎన్‌.వి.సురేష్‌, తదితరులు పాల్గొన్నారు. 

Read more