దుర్గమ్మకు ఐదు కేజీల వెండి బిస్కెట్ల విరాళం

ABN , First Publish Date - 2022-08-15T05:48:34+05:30 IST

ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో కనకదుర్గమ్మ అలంకార నిమిత్తం విశాఖపట్నానికి చెందిన అంబటి సంతోష్‌, కుటుంబ సభ్యులతో కలిసి ఐదు కేజీల బరువు కలిగిన 17 వెండి బిస్కెట్లను ఆదివారం దేవస్థానం అధికారులకు విరాళం అందజేశారు.

దుర్గమ్మకు ఐదు కేజీల వెండి బిస్కెట్ల విరాళం

వన్‌టౌన్‌, ఆగస్టు 14 : ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో కనకదుర్గమ్మ అలంకార నిమిత్తం విశాఖపట్నానికి చెందిన అంబటి సంతోష్‌, కుటుంబ సభ్యులతో కలిసి ఐదు కేజీల బరువు కలిగిన 17 వెండి బిస్కెట్లను ఆదివారం దేవస్థానం అధికారులకు విరాళం అందజేశారు. దేవస్థానంలో ఆదివారం అర్చకస్వాములు సూర్యోపాసన సేవ నిర్వహించారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు. 

  దుర్గగుడిలో భక్తుల రద్దీ 

శ్రావణమాసం, ఆదివారం సందర్భంగా కనకదుర్గమ్మను దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆలయ ప్రాంగణంలోని క్యూలో భక్తులు బారులు తీరారు. ఆలయ ఈవో భ్రమరాంబ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పర్యవేక్షించారు. శుక్ర, శనివారాలు ప్రభుత్వ సెలవు దినాలు కావడంతో పెద్దఎత్తున అమ్మవారి దర్శనానికి తరలి వస్తారని ముందస్తుగా ప్రత్యేక ఏర్పాట్లతో పాటు ఆలయ ఉద్యోగులకు ప్రత్యేక విధులను కేటాయించారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అమ్మవారిని దర్శించుకున్నారు.   


Read more