ఎరుపెక్కిన ఇంద్రకీలాద్రి

ABN , First Publish Date - 2022-10-08T06:03:17+05:30 IST

ఎరుపెక్కిన ఇంద్రకీలాద్రి

ఎరుపెక్కిన ఇంద్రకీలాద్రి

కొనసాగుతున్న భవానీల రాక

నేడు, రేపు రద్దీ పెరిగే అవకాశం

వన్‌టౌన్‌, అక్టోబరు 7 : ఇంద్రకీలాద్రిపై భవానీల రద్దీ కొనసాగుతోంది. ఎటుచూసినా భవానీల కోలాహలమే కనిపిస్తోంది. దసరా ఉత్సవాల ఆరంభం నుంచి ఇప్పటివరకు సుమారు 15 లక్షల మంది భవానీలు ఇంద్రకీలాద్రి వచ్చారని అధికారుల అంచనా. శుక్రవారం కూడా భక్త ప్రవాహం కొనసాగింది. క్యూలన్నీ భక్తులతో నిండిపోయాయి. సాధారణంగా అమ్మవారిని శుక్రవారం నాడు భక్తులు విశేషంగా దర్శించుకుంటారు. సాధారణ రోజుల్లో 15 వేల నుంచి 20 వేల మంది వస్తారని అంచనా. కాగా దసరా ఉత్సవాలు ముగిసిన మూడోరోజైన శుక్రవారం దాదాపు 30 వేల మంది వరకు దర్శించుకున్నారు. భవానీల రాక పెరగడంతో విజయదశమి తరువాత అదనంగా మరో రోజు రాజరాజేశ్వరీదేవి అలంకారాన్నే కొనసాగించారు. శుక్రవారం మాత్రం కనకదుర్గాదేవి అలంకారంలోనే అమ్మ దర్శనమిచ్చింది. ఇక శని, ఆదివారాలు సెలవులు కావడంతో రద్దీ మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తిరుమలలో భక్తుల రద్దీ తారస్థాయికి చేరింది. వెంకన్నను దర్శించుకున్న భక్తులు దుర్గమ్మ వద్దకు రావడం ఆనవాయితీ. ఈ దృష్ట్యా రానున్న రెండు రోజుల్లో దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని అంచనా.
Read more