ప్రజా సమస్యలపై 11న మహాధర్నా

ABN , First Publish Date - 2022-07-07T05:53:52+05:30 IST

జనం కోసం సీపీఏం కార్యక్రమంలో సర్వే చేసిన సమస్యలను పరిష్కరించాలని ప్రజల చేత అర్జీలు పెట్టించి కలెక్టర్‌కు అందించాలని, ఈనెల 11న కలెక్టరేట్‌ల వద్ద జరిగే మహాధర్నాలో ప్రజలు పెద్దఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని సీపీఏం 21వ డివిజన్‌ కమిటీ అధ్వర్యంలో బుధవారం ప్రచార పాదయాత్ర జరిగింది.

ప్రజా సమస్యలపై 11న మహాధర్నా

కృష్ణలంక : జనం కోసం సీపీఏం కార్యక్రమంలో సర్వే చేసిన సమస్యలను పరిష్కరించాలని ప్రజల చేత అర్జీలు పెట్టించి కలెక్టర్‌కు అందించాలని, ఈనెల 11న కలెక్టరేట్‌ల వద్ద జరిగే మహాధర్నాలో ప్రజలు పెద్దఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని సీపీఏం 21వ డివిజన్‌ కమిటీ అధ్వర్యంలో బుధవారం ప్రచార పాదయాత్ర జరిగింది. ఇందులో పాల్గొన్న సీపీఏం రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యుడు చిగురుపాటి బాబురావు, సీపీఏం జిల్లా కార్యదర్శివర్గసభ్యుడు దోనేపూడి కాశీనాథ్‌ మాట్లాడుతూ దాదాపు నెలరోజుల పాటు జనం కోసం సీపీఏం కార్యక్రమంలో ప్రజల వద్దకు వెళ్లి సీపీఏం సర్వే నిర్వహించిందని, ఈ సర్వేలో గడపగడపనా ప్రజలు సమస్యలు తెలియజేశారన్నారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని వైసీపీ పన్నుల భారాల వల్ల అధిక ధరల మోత భరించలేకపోతున్నారన్నారు. కుటుంబాలను పోషించుకోవడం ఎలాగో తెలియక సతమతమవుతున్నారన్నారు. మరో పక్క ఆస్తిపన్ను, చెత్తపన్ను పెంపు భారాలతో ప్రజలు విలవిలలాడుతున్నారన్నారు. విద్యుత్‌ చార్జీలు ప్రభుత్వమే పెంచి మరో పక్క ఎక్కువ కరెంట్‌ బిల్లు వచ్చిందని పథకాలు ఆపేస్తోందన్నారు. చట్టవిరుద్ధమైన చెత్తపన్ను బలవంతపు వసూళ్లు ఆపకపోతే ప్రజల వ్యతిరేకతతో... వచ్చే ఇంటిపన్నులు కూడా రావన్నారు. ప్రజలంతా ఐక్యంగా వీటిని ఎదుర్కోవాలని బాబూరావు, కాశీనాథ్‌ పిలుపునిచ్చారు. డివిజన్‌లో ఎక్కడ చూసినా డ్రెయినేజీ పొంగిపొర్లుతోందని, పెంచిన మంచినీటి కుళాయి చార్జీలను రద్దు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. పై సమస్యలన్నింటిపై 11వ తేదీ కలెక్టరేట్‌లో స్పందనలో అర్జీల రూపంలో అడుగుదామని ప్రజలంతా పెద్దఎత్తున ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు కోరారు.  Read more