వర్షానికి కూలిన డ్రెయిన్‌

ABN , First Publish Date - 2022-09-28T06:27:09+05:30 IST

పట్టణ శివారు తొర్రగుంటపాలెంలో ఇటీవల పురపాలక సంఘం చేపట్టిన డ్రెయినేజీ గోడ కూలిపోయింది.

వర్షానికి కూలిన డ్రెయిన్‌
దెబ్బతిన డ్రెయినేజీ

నాణ్యతపై విమర్శల వెల్లువ

జగ్గయ్యపేట, సెప్టెంబరు 27: పట్టణ శివారు తొర్రగుంటపాలెంలో ఇటీవల పురపాలక సంఘం చేపట్టిన డ్రెయినేజీ గోడ కూలిపోయింది. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వర్షపు నీరు  పొంగి  పొర్లింది. తెల్లవారేసరికి డ్రెయిన్‌ గోడ రెండు, మూడు చోట్ల బీటల్‌ వారి వాలిపోయింది.  సామాజిక మాధ్యమాల్లో డ్రెయిన్‌ నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు సరిగాలేవంటూ స్థానికులు పోస్టింగ్‌లు పెట్టటంతో ఆ వార్డు కౌన్సిలర్‌ సామినేని వెంకటకృష్ణ ప్రసాద్‌ స్పందించారు.  కాంట్రాక్టర్‌ను విచా రించి, తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. Read more