దొరికినట్టే దొరికి.. జారుకున్న దొంగ

ABN , First Publish Date - 2022-04-10T05:40:51+05:30 IST

దొరికినట్టే దొరికి.. జారుకున్న దొంగ

దొరికినట్టే దొరికి.. జారుకున్న దొంగ

హనుమాన్‌జంక్ట్షన్‌, ఏప్రిల్‌ 9 : దొంగిలించిన వస్తువులు, కూరగాయలు అమ్మడానికి ప్రయత్నించిన వ్యక్తిని స్థానికులు పట్టుకునే సందర్భంలో మోటారు సైకిల్‌ను వదిలిపెట్టి  పరారైన ఘటన స్థానిక నూజివీడు రోడ్డులోని రైతు బజారు వద్ద శనివారం జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. దొంగి లించిన కూరగాయల మూటను ఓ వ్యక్తి రైతు బజార్‌లో అమ్మటానికి ప్రయత్నించాడు. అనుమానం వచ్చిన రైతు బజార్‌లోని వ్యాపారులు అతనిని నిలదీశారు. దీంతో  వారి మధ్య వాగ్వావాదం జరిగింది. దీంతో మూటతో పాటు మోటార్‌ సైకిల్‌ను వదిలిపెట్టి ఆ వ్యక్తి పరారయ్యాడు. మోటా రు సైకిల్‌ను ఎస్సై టి.సూర్యశ్రీనివా్‌సకు అప్పగించారు. మోటార్‌ సైకిల్‌ నెంబర్‌ ఆధారంతో ఎస్సై విచారించగా పెనమలూరుకు చెందిన రౌడీషీటర్‌ షేక్‌ హుస్సేన్‌గా గుర్తించారు. మోటార్‌ సైకిల్‌తో  పాటు సంచిలో గోడ గడియా రం, ఇత్తడి తాపడం లభించాయి. గోడ గడియారం మీద ఉన్న ఫోన్‌నెంబర్‌ సాయంతో విచారించగా నూజివీడు మండలం సీతారాంపురంలోని ఓ గుడిలో వాటిని దొంగిలిం చిన ట్లు తెలిసింది. నిందితుడి కోసం  పోలీసులు గాలిస్తున్నారు.

Read more