టీటీడీ నిత్యాన్నదానానికి..పది టన్నుల కూరగాయల వితరణ

ABN , First Publish Date - 2022-09-26T06:09:34+05:30 IST

టీటీడీ నిత్యాన్నదానానికి..పది టన్నుల కూరగాయల వితరణ

టీటీడీ నిత్యాన్నదానానికి..పది టన్నుల కూరగాయల వితరణ
కూరగాయల లారీని జెండా ఊపి ప్రారంభిస్తున్ననంగినేని శ్రీనివాసరావు, కుటుంబరావు తదితరులు

లబ్బీపేట, సెప్టెంబరు 25: టీటీడీ నిత్యాన్నదానానికి పదిహేళ్ల నుంచి కుటుంబరావు కూరగాయలు పంపించడం అభినందనీయమని ప్రముఖ పారిశ్రామికవేత్త నంగినేని శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం బృందావన్‌కాలనీలోని ఏ కన్వెన్షన్‌ నుంచి రూ.లక్షన్నర విలువైన 10 టన్నుల కూరగాయలను తిరుమలకు లారీలో పంపించారు. లారీని కుటుంబరావు, శ్రీనివాసరావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్య క్రమంలో రావెళ్ల వెంకటసుబ్బయ్య, అరుణకుమారి, అరుణభారతి, పొట్లూరి రవిచంద్‌, శివపార్వతి, మండవ నాగేశ్వరరావు బ్రదర్స్‌, మండం సాయి, శారద, తుమ్మల నరేంద్ర, వాసవి, బొడ్డకాయల దుర్గాప్రసాద్‌, హైమావతి, చలసాని వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.


Read more