రైతాంగ సమస్యలపై కోడూరులో ధర్నా నేడు

ABN , First Publish Date - 2022-10-14T06:01:01+05:30 IST

రైతాంగ సమస్యలపై కోడూరులో ధర్నా నేడు

రైతాంగ సమస్యలపై కోడూరులో ధర్నా నేడు

అవనిగడ్డ టౌన్‌, అక్టోబరు 13: కోడూరు, నాగాయలంక మండలాల రైతుల సమ స్యల పరిష్కారం కోసం శుక్రవారం ఉదయం 10 గంటలకు కోడూరు తహసీల్దార్‌ కార్యాల యం వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, విజయవంతం చేయాలని మాజీ ఉపస భాపతి మండలి బుద్ధప్రసాద్‌ పిలుపునిచ్చారు. మురుగు పారుదల వ్యవస్థ సరిగా లేక వం దలాది ఎకరాల పంట పొలాలు ఏటా నీట మునుగుతున్నాయన్నారు. మూడేళ్లుగా కోడూరు మండలంలో కొన్ని గ్రామాల్లో ఒక్క పంట కూడా తీయలేదన్నారు. రైతులకు పరిహారం అం దించాలని డిమాండ్‌ చేశారు. ధర్నా అనంతరం కోడూరు ప్రధాన సెంటర్‌లో బహిరంగ సభ ఉంటుందని టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి కొల్లూరి వెంకటేశ్వరరావు తెలిపారు.


Read more