అసమర్థ పాలనలో రాష్ట్రం అధోగతి

ABN , First Publish Date - 2022-10-04T06:55:59+05:30 IST

: అసమర్థ సీఎం పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు.

అసమర్థ పాలనలో రాష్ట్రం అధోగతి

- నిరసన దీక్షలో దేవినేని ఉమా ధ్వజం

గొల్లపూడి, అక్టోబరు 3 : అసమర్థ సీఎం పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరును కొనసాగించాలని కోరుతూ గొల్లపూడిలో ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద నిరసన దీక్ష సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మూడున్నరేళ్లలో అక్రమ కేసులు, అరెస్టులు తప్ప ఈ ప్రభుత్వం చేసింది శూన్యం అన్నారు. ఏపీ సీఐడీ పోలీసులు పక్క రాష్ట్రంలోనూ నవ్వులపాలవుతున్నారన్నారు. హెల్త్‌ యూనివర్సిటీ కి ఎన్టీఆర్‌ పేరు తొలగించి తెలుగువారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారన్నారు. ప్రజా కంటక పాలన చేస్తున్న సర్కార్‌ను రాబోయే రోజుల్లో సాగనంపటానికి జనం సిద్ధంగా ఉన్నారు. ఎన్టీఆర్‌ వైద్య విశ్వవిద్యాలయం పేరు కొనసాగించేంత వరకు పోరాటాలు చేస్తామని అన్నారు. కార్యక్రమంలో తంగిరాల సౌమ్య, నెట్టెం రఘురామ్‌ మాట్లాడారు.  

Read more