రాజీవ్‌గాంధీ పార్కులో అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2022-12-30T00:48:28+05:30 IST

రాజీవ్‌గాంధీ పార్కులో మిగిలిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని నగర కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ అధికారులను ఆదేశించారు.

రాజీవ్‌గాంధీ పార్కులో అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలి

రాజీవ్‌గాంధీ పార్కులో అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలి

కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌

చిట్టినగర్‌: రాజీవ్‌గాంధీ పార్కులో మిగిలిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని నగర కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ అధికారులను ఆదేశించారు. గురువారం రాజీవ్‌గాంధీ పార్కును కమిషనర్‌ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పార్కు పరిసరాలలో పనికిరానీ స్ర్కాబ్‌, మట్టి కుప్పలను తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో అదనపు కమిషనర్‌ ప్రాజెక్ట్‌ కె.వి.సత్యవతి, ఏఈ పుల్లారావు, సూపర్‌వైజర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-30T00:48:28+05:30 IST

Read more