డొంక రోడ్లు అభివృద్ధి చేస్తాం

ABN , First Publish Date - 2022-11-30T00:31:33+05:30 IST

జగ్గయ్యపేట ఏఎంసీ ద్వారా నియోజకవర్గంలో రైతులు పొలాలకు వెళ్లే డొంక రోడ్లను అభివృద్ధి చేస్తానని ఏఎంసీ చైర్మన్‌ ముత్తినేని విజయ్‌శేఖర్‌ అన్నారు.

డొంక రోడ్లు అభివృద్ధి చేస్తాం

పెనుగంచిప్రోలు, నవంబరు 29: జగ్గయ్యపేట ఏఎంసీ ద్వారా నియోజకవర్గంలో రైతులు పొలాలకు వెళ్లే డొంక రోడ్లను అభివృద్ధి చేస్తానని ఏఎంసీ చైర్మన్‌ ముత్తినేని విజయ్‌శేఖర్‌ అన్నారు. మండల సమావేశం ఎంపీపీ మార్కపూడి గాంధీ అధ్యక్షతన మంగళవారం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ముత్తినేని మాట్లాడుతూ డొంక రోడ్లు ఎంతో కాలంగా అభివృద్ధికి నోచుకోకపోవడం వల్ల రైతులు పడుతున్న ఇబ్బందులు తన దృష్టికి రావడంతో ఏఎంసీ ద్వారా సాధ్యమైనన్ని రోడ్లను తప్పని సరిగా అభివృద్ధి చేస్తానన్నారు. ఏఎంసీ చైర్మన్‌గా నూతనంగా నియమించబడిన ముత్తినేనిని ఘనంగా సత్కరించారు. జడ్పీటీసీ సభ్యురాలు ఊట్ల నాగమణి మాట్లాడుతూ సుబ్బాయిగూడెంలోని జగనన్న లే అవుట్‌లో ఇళ్ల నిర్మాణం వేగవంతంగా జరిగే విధంగా అధికారులు ప్రజా ప్రతినిధులు సమష్టిగా పని చేయాలన్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలపై ఎంపీపీ గాంధీ, ఎంపీడీవో ప్రసాద్‌ వివరించారు. సమావేశంలో వైస్‌ ఎంపీపీ గుంటుపల్లి వాసు, తహసీల్దార్‌ కె.లక్ష్మి కల్యాణి, ఏవో సుబ్బారెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-30T00:31:33+05:30 IST

Read more