దుకాణాల కూల్చివేత దుర్మార్గపు చర్య

ABN , First Publish Date - 2022-08-21T06:00:42+05:30 IST

దుకాణాల కూల్చివేత దుర్మార్గపు చర్య

దుకాణాల కూల్చివేత దుర్మార్గపు చర్య

అవనిగడ్డ టౌన్‌, ఆగస్టు 20: డీఎస్పీ కార్యాలయం రోడ్డు పక్కన చిరు వ్యాపారాలు చేసుకుంటున్న వారి దుకాణాలను పంచాయతీ సిబ్బంది కూల్చివేయటం దుర్మార్గమైన చర్య అని జడ్పీటీసీ మాజీ సభ్యుడు కొల్లూరి వెంకటేశ్వరరావు, టీడీపీ నేతలు యాసం చిట్టిబాబు, బండే రాఘవ అన్నారు. సామగ్రిని తరలించుకునే సమ యం ఇవ్వకుండా మొత్తాన్ని ధ్వంసం చేయడం కక్ష సాధింపుతో చేసినట్లు ఉందన్నారు. కట్టబోయే దుకాణాల సముదాయంలో ఇప్పుడు నిర్వాసితులైన వ్యాపారులకు మొదటి ప్రాధాన్యమివ్వాలని డిమాండ్‌ చేశారు. పులిగడ్డ నాంచారయ్య, బచ్చు రఘునాథ్‌, మురళీధరరావు, యలవర్తి చిన్నా, అడపా శ్రీను పాల్గొన్నారు. 


Read more