తండ్రికి తనయ అంతిమ సంస్కారం

ABN , First Publish Date - 2022-09-29T07:24:08+05:30 IST

కొడుకులు ఉన్నా పట్టించుకోని ఈ రోజుల్లో కన్న కూతురే అన్నీ తానై తండ్రికి తలకొరివి పెట్టింది. కొంకేపూడి గ్రా మానికి చెందిన కాగిత శివరామకృష్ణ(42) తల్లి, భార్య, ఇద్దరు కుమార్తెలతో తాపీపని చేసుకుంటూ జీవిస్తున్నాడు.

తండ్రికి  తనయ అంతిమ సంస్కారం

పెడన రూరల్‌ : కొడుకులు ఉన్నా పట్టించుకోని ఈ రోజుల్లో కన్న కూతురే అన్నీ తానై తండ్రికి తలకొరివి పెట్టింది. కొంకేపూడి గ్రా మానికి చెందిన కాగిత శివరామకృష్ణ(42) తల్లి, భార్య, ఇద్దరు కుమార్తెలతో తాపీపని చేసుకుంటూ జీవిస్తున్నాడు. భార్య కృష్ణవేణి అంగవైకల్యంతో అంగన్‌వాడి కార్యకర్తగా పనిచేస్తున్నది. అనుష్క(13), శ్రీదేవి (11) చదువుకుంటున్నారు, తల్లి అనారోగ్యంతో మంచాన ఉంది.  నడుపూరులో  మంగళవారం గుర్తుతెలియని వాహనం ఢీకొని శివరామకృష్ణ మృతి చెందాడు. బుధవారం జరిగిన అంత్యక్రియల్లో తండ్రికి పెద్దకుమార్తె అనుష్క తలకొరివి పెట్టింది. సెంటు భూమి కూడా లేని ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్‌ దావు భైరవలింగం, ఎంపీటీసీ  సభ్యుడు దావు నాగగంగ తదితరులు  కోరారు.  

Read more