దసరా ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు

ABN , First Publish Date - 2022-09-17T06:34:08+05:30 IST

ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం, దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు.

దసరా ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు

భక్తులకు ఇబ్బంది కలగకుండా చర్యలు

ఉచిత దర్శనాలు మినహా ఎవరైనా టికెట్‌ కొనాల్సిందే!

వీఐపీల కోసం ఘాట్‌రోడ్డులో అదనపు క్యూ లైన్లు 

మంత్రి కొట్టు సత్యనారాయణ

అమరావతి, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి) : ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం, దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం అమరావతి సచివాలయంలో మీడియా పాయింట్‌ వద్ద ఆ యన మాట్లాడుతూ ఈ నెల 26 నుంచి వచ్చే నెల 5 వరకు కనకదుర్గమ్మ ఆలయంలో శరన్నవరాత్రుల ని ర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గత అ నుభవాలను దృష్టిలో పెట్టుకుని, కట్టుదిట్టమైన చ ర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ ఏడాది సాధారణ భక్తులకు ఉచిత దర్శనాలు మినహా, ఇతరులంతా టి కెట్‌ కొనుక్కోవాల్సిందేనని, వీఐపీ లేఖ ఉన్నా రూ.500 టికెట్‌ కొనాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. వీఐపీల కోసం ఘాట్‌రోడ్డులో అదనపు క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నామని, స్టేట్‌ గెస్ట్‌హౌస్‌, కలెక్టరేట్‌, బెరం పా ర్కు వద్ద పికప్‌ పాయింట్లు ఏర్పాటు చేసి, అక్కడే టి కెట్లు విక్రయిస్తామన్నారు. అక్కడి నుంచి వాహనాల్లో తీసుకొచ్చి, ఓం సెంటర్లో దించుతామని, అక్కడి నుం చి రూ.500 క్యూలైన్‌లో దర్శనానికి వెళ్లాలని సూచించారు. రూ.100, రూ.300 టికెట్‌ క్యూలైన్లతో పాటు ఉచిత దర్శనానికి మరో రెండు క్యూలైన్లు ఉంటాయని, బస్డాండ్‌, రైల్వే స్టేషన్లలో కౌంటర్లు కొనసాగుతాయన్నారు. భక్తుల స్నానాల కోసం 800 షవర్లు, తాత్కాలిక మరుగుదొడ్లు, కేశఖండనకు వసతి ఏర్పాటు చేస్తామని మంత్రి వివరించారు. 

దసరా మహోత్సవాలకు రండి!

సీఎంకు ఆహాన పత్రిక అందించిన మంత్రి కొట్టు సత్యనారాయణ

విజయవాడ : ఇంద్రకీలాద్రిపై ఈ నెల 26 నుంచి ప్రారంభమయ్యే దసరా మహోత్సవాల ఆహ్వాన పత్రికను సీఎం జగన్‌మోహన్‌ రెడ్డికి మంత్రి కొట్టు సత్యనారాయణ శుక్రవారం అందజేశారు. ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించాలని కోరారు. సీఎంను కలిసిన వారిలో ఈవో డి.భ్రమరాంబ, ఎమ్మెల్యే మ ల్లాది విష్ణు, స్థానాచార్య శివప్రసాద్‌శర్మ, తూర్పు వైసీపీ ఇన్‌చార్జి దేవినేని అవినాశ్‌ ఉన్నారు. అ నంతరం వేదిపండితులు సీఎంకు ఆశీర్వచనం అందచేసి, అమ్మవారి తీర్థప్రసాదాలను ఇచ్చారు.

Read more