పోలీసులు పట్టువస్త్రాల సమర్పణ

ABN , First Publish Date - 2022-09-26T05:46:45+05:30 IST

పోలీసులు పట్టువస్త్రాల సమర్పణ

పోలీసులు పట్టువస్త్రాల సమర్పణ

వన్‌టౌన్‌, సెప్టెంబరు 25 : ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలను పురస్కరించుకుని ఆదివారం రాత్రి పోలీసులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. మేళతాళాల నడుమ పోలీస్‌ కమిషనర్‌ కాంతిరాణా దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలను ఊరేగింపుగా తీసుకెళ్లారు. అంతకుముందు వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పీఎస్‌లోని చెట్టు వద్ద పూజలు నిర్వహించిన సీపీ దంపతులు అనంతరం ఇంద్రకీలాద్రి చేరుకుని దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించారు. ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, డీసీపీ విశాల్‌ గున్నీ, ఏడీసీపీ కొల్లి శ్రీనివాసరావు, ఏసీపీలు హనుమంతరావు, రవికిరణ్‌, సీఐ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Read more