-
-
Home » Andhra Pradesh » Krishna » cps raddhu chiyali-NGTS-AndhraPradesh
-
సీపీఎస్ రద్దు చేయాలి
ABN , First Publish Date - 2022-04-24T05:54:21+05:30 IST
సీపీఎస్ రద్దు చేయాలి

హనుమాన్‌జంక్షన్ రూరల్, ఏప్రిల్ 23 : పాదయాత్ర సంద ర్భంగా జగన్మోహన రెడ్డి వారంలో సీపీఎస్ రద్దు చేస్తానని హామీ ఇచ్చి నమ్మించి మోసం చేశా రని ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూటీ ఎఫ్ బాపులపాడు మండల ఆధ్వ ర్యంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు శనివారం నిర్వహించిన బైక్‌ర్యాలీలో జిల్లా ప్రధాన కార్యదర్శి సుందరయ్య, మండల నాయకులు రమణ నాయక్, యలమర్తి రవిలతో కలిసి ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.90 లక్షల మంది సీపీఎస్ పరిధిలో ఉన్నారని, వెంటనే సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్ర మంలో సీఐటీయూ నాయకులు బేతా శ్రీనివాసరావు, రాజనాల సురేష్, అబ్దుల్‌బారీ, రైతు సంఘ నాయకులు వెంకటేశ్వరరావు పాల్గొని తమ సంఘీభావాన్ని తెలిపారు.