సీఆర్‌డీఏ చట్ట సవరణలు ప్రజాస్వామ్యానికి విరుద్ధం

ABN , First Publish Date - 2022-09-24T06:32:42+05:30 IST

ఇటీవల జరిగిన శాసన సభ సమావేశాల్లో సీఆర్‌డీఏ చట్టానికి చేసిన సవరణలు ప్రజాస్వామ్యానికే ముప్పు తెస్తాయ ని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సీహెచ్‌ బాబూరావు శుక్రవారం ఒ క ప్రకటనలో అన్నారు.

సీఆర్‌డీఏ చట్ట సవరణలు ప్రజాస్వామ్యానికి విరుద్ధం

 సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సీహెచ్‌ బాబూరావు

అజిత్‌సింగ్‌నగర్‌, సెప్టెంబరు 23 : ఇటీవల జరిగిన శాసన సభ సమావేశాల్లో సీఆర్‌డీఏ చట్టానికి చేసిన సవరణలు ప్రజాస్వామ్యానికే ముప్పు తెస్తాయ ని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సీహెచ్‌ బాబూరావు శుక్రవారం ఒ క ప్రకటనలో అన్నారు. రాజధాని మాస్టర్‌ ప్లాన్‌, భూ వినియోగం మార్పులు, స్థా నిక సంస్థల ఏర్పాటు తదితర అంశాలపై ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ప్ర భుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలన్నారు. గ్రామసభలకున్న అధికారాన్ని రద్దు చే సి, అధికార యంత్రాగానికి నిర్ణయాధికారాన్ని దాఖలు పరచడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రజాభిప్రాయాన్ని లెక్కచేయకుండా, నిరంకుశ ని ర్ణయాలను ప్రజలపై రుద్దటం, తదనుగుణంగా చట్ట సవరణలు చేయడం ప్రజా వ్యతిరేక చర్యన్నారు. రాజధాని అమరావతిని నిర్వీర్యం చేయడానికే రాజధాని రైతులు, ప్రజలను నట్టేట ముంచడానికి ఈ చట్ట సవరణలు ఉద్దేశించబడినవన్నారు. శాసనసభలో చేసిన చట్ట సవరణలు రైతులు, అమరావతి ప్రజలతో చేసుకున్న ఒప్పందాలకు భిన్నమైనవన్నారు. రాజధానిపై హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిన అనంతరం దాన్ని గౌరవించాల్సింది పోయి, భిన్నంగా చట్ట సవరణలు చేయడం సరికాదన్నారు. చట్ట సవరణలు రద్దు చేసి రాజధాని రైతులు, ప్రజలకిచ్చిన చట్టబద్దమైన హామీలు ప్రభుత్వం అమలు చేయాలని, హైకోర్టు తీర్పునకు అనుగుణంగా అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. 

Read more