-
-
Home » Andhra Pradesh » Krishna » CPM-NGTS-AndhraPradesh
-
హాకర్స్ సమస్యలను పరిష్కరించాలి
ABN , First Publish Date - 2022-09-17T06:34:41+05:30 IST
అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న హాకర్స్ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు డి మాండ్ చేశారు.

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు
గవర్నర్‌పేట, సెప్టెంబరు 16 : అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న హాకర్స్ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు డి మాండ్ చేశారు. విజయవాడ హాకర్స్, తోపుడుబండ్ల యూనియన్ (సీఐటీయూ) నగర 8వ మహాసభలు శుక్రవారం ఎంజీ రోడ్డులోని మాకినేని బసవపున్న య్య విజ్ఞాన కేంద్రంలో జరిగాయి. ఈ సందర్భంగా బాబూరావు మాట్లాడుతూ నగర వ్యాప్తంగా 20వేల మంది చిరు వ్యాపారులు రోడ్డు మార్జిన్లో వ్యాపారా లు చేసుకుంటున్నారన్నారు. వీరికి కనీస సౌకర్యాలు కల్పించడంలో స్థానిక సంస్థలు విఫలమౌతున్నాయన్నారు. సీపీఎం జిల్లా నేత దోనేపూడి కాశీనాథ్ మా ట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రభు త్వం, మున్సిపల్ అధికారులు వివిధ రకాల పన్నులు పేదలపై విధిస్తూ వేధిస్తున్నారన్నారు. మున్సిపల్ అ ధికారులు, పోలీసు సిబ్బంది వేధింపులు నిత్యం ఎదుర్కొంటూ హాకర్లు వ్యాపారాలు చేసుకోవడం కష్టంగా మారిందన్నారు. హాకర్లకు గుర్తింపు కార్డులివ్వడంతో పాటు, వడ్డీలేని రుణాలందించి ఆదుకోవాలని డి మాండ్ చేశారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్సీహెచ్ శ్రీనివాస్, సెంట్రల్ సిటీ అధ్యక్ష, కార్యదర్శులు కె. దుర్గారావు, ఎంవీ సుధాకర్, హాకర్స్ యూ నియన్ నగరాధ్యక్ష, కార్యదర్శులు భూలోకం, సిహెచ్ మురళీ, ఆర్గనైజింగ్ కార్యదర్శి బి. లక్ష్మణరావు, కోశాధికారి వైబీ కృష్ణ, ఎం.సీతారాములు, వై. సుబ్బారావు, ఎం. బాబూరావు, టి. ప్రభుదాస్, తూ ర్పు సిటీ సీఐటీయూ ప్రధాన కార్యదర్శి కోటిబాబు పాల్గొన్నారు.