మరణం వరకూ శిక్ష

ABN , First Publish Date - 2022-10-11T06:14:44+05:30 IST

ఏడేళ్ల బాలికకు నెమలి ఈక లిస్తానని చెప్పి పాఠశాల నుంచి తీసుకెళ్లి అత్యాచారం చేసిన కేసులో నిందితుడికి న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.

మరణం వరకూ శిక్ష

బాలికపై అత్యాచారం కేసులో తీర్పు 

విజయవాడ, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి) : ఏడేళ్ల బాలికకు నెమలి ఈక లిస్తానని చెప్పి పాఠశాల నుంచి తీసుకెళ్లి అత్యాచారం చేసిన కేసులో నిందితుడికి న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. మరణం వరకు అతడు ఈ శి క్షను అనుభవించాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు. విజయవాడ రూరల్‌ మండ లం నున్న గ్రామానికి చెందిన దంపతులు కూలీ పనులు చేసుకుంటారు. భర్త లారీ డ్రైవర్‌ కాగా, భార్య సూరంపల్లిలోని పరిశ్రమలో పనిచేస్తోంది. వారికి ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. వాళ్లంతా మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నారు. ఏడేళ్ల వయస్న్ను రెండో కుమార్తె ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఉద యం పాఠశాలకు వెళ్లింది. తిరిగి ఇంటికి వచ్చేసరికి నీరసంగా కనిపించింది. ఎం దుకలా ఉన్నావని తల్లి అడగ్గా జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాలిక ఉద యం పాఠశాలకు వెళ్లేసరికి ఇంకా తలుపులు తెరవలేదు. బయట కూర్చుని ఉన్న బాలిక వద్దకు అదే ప్రాంతానికి చెందిన జెర్రిపోతు అనిల్‌ అనే యువకుడు వెళ్లా డు. ఆమెకు నెమలి ఈకలు ఇస్తానని చెప్పి పాఠశాలకు సమీపాన ఉన్న చెట్టుచా టుకు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. జరిగిన విషయాన్ని బాలిక తన తల్లికి వివ రించింది. దీనిపై ఆమె నున్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్రైం నంబర్‌ 74/20 22తో ఐపీసీ 363. 376(ఎ)(బి), 506 ఆఫ్‌ పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశా రు. కేసును విజయవాడలోని పోక్సో కోర్టు విచారించింది. న్యాయమూర్తి ఎస్‌.రజని మొత్తం 26 మంది సాక్షులను విచారించారు. బాధితురాలి తరపున ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ జీవీ నారాయణరెడ్డి వాదనలు వినిపించారు. ముద్దాయి అనిల్‌పై నేరం రుజువు కావడంతో యాజ్జీవ జీవిత కారాగార శిక్ష (మరణించే వరకు) విధించడంతోపాటు రూ.3వేల జరిమానా విధిస్తూ సోమవారం తీర్పు చెప్పారు.

Read more