-
-
Home » Andhra Pradesh » Krishna » Controversial land survey in Narikimpadu-NGTS-AndhraPradesh
-
నారికింపాడులో వివాదాస్పద భూమి పరిశీలన
ABN , First Publish Date - 2022-10-01T06:28:57+05:30 IST
వివాదాస్పద భూమిని శుక్రవారం డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే అధికారి సారంగపాణి శుక్రవారం పరిశీలించారు.

గంపలగూడెం, సెప్టెంబరు 30: వివాదాస్పద భూమిని శుక్రవారం డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే అధికారి సారంగపాణి శుక్రవారం పరిశీలించారు. నారికింపాడులో సర్వే నంబరు 28/3బీలో 1.80 ఎకరాల భూమికి సంబంధించి 73 సెంట్లు బన్నే పెద్ద నరసయ్యది కాగా, 72 సెంట్లు బన్నె చిన్న నరసయ్యకు చెందింది. మిగిలిన 30 సెంట్లు పోలంకి ప్రతాప్‌రెడ్డి కొనుగోలు చేశారు. 2006లో నరసయ్య నుంచి చెరుకూరు మధుసూదనరావు 73 సెంట్లు కొనుగోలు చేశాడు. 1.80 ఎకరాల భూమికి సబ్ డివిజన్ జరగకపోవడంతో పోలంకి ప్రతాప్‌రెడ్డిని తన భూమిలోకి రానివ్వడం లేదు. దీనిపై పోలంకి ప్రతాప రెడ్డి స్పందనలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆమేరకు సారంగపాణి ఆ భూమిని పరిశీలించారు. మండల సర్వేయర్ సాంబశివరావు, విలేజ్ సర్వేయర్ రాంబాబు పాల్గొన్నారు.