హెల్త్‌ వర్సిటీ పేరుమార్పు దుర్మార్గం

ABN , First Publish Date - 2022-09-28T06:28:08+05:30 IST

హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు తొలగించడం దుర్మార్గమైన చర్య అని టీడీపీ నాయకులు ఆరోపించారు.

హెల్త్‌ వర్సిటీ పేరుమార్పు దుర్మార్గం
రిలే దీక్షలో తెలుగు యువత నాయకులు

తిరువూరు, సెప్టెంబరు 27: హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు తొలగించడం దుర్మార్గమైన చర్య అని టీడీపీ నాయకులు ఆరోపించారు. మంగళవారం రీలే దీక్షల్లో రెండోరోజు నియోజకవర్గం తెలుగుయువత నాయకులు పాల్గొన్నారు. నియోజకవర్గం ఇన్‌చార్జి శావల దేవదత్‌ శిబిరాన్ని ప్రారంభించారు. తెలుగు యువత నాయకులు మాదల హరిచరణ్‌(కిట్టు), కవులూరి రాజాచంద్రమౌళీ, పిట్టా చైతన్య, ఉదారపు మార్కేండేశ్వరరావు, మానికొండ రామకృష్ణ, బొల్లిపొగుశ్యామ్‌, వంశీ, కిషోర్‌, అబ్బాస్‌  దీక్షలో పాల్గొన్నారు. 


Read more