-
-
Home » Andhra Pradesh » Krishna » Changing the name of Health University is evil-NGTS-AndhraPradesh
-
హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు దుర్మార్గం
ABN , First Publish Date - 2022-09-26T06:07:54+05:30 IST
హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు దుర్మార్గం

పాయకాపురం, సెప్టెంబరు 25: ఆరోగ్య విశ్వ విద్యాలయం పేరును మార్చడం దుర్మార్గపు చర్య అని పలువురు టీడీపీ నేతలు అన్నారు. ఆదివారం 61వ డివిజన్ శాంతి నగర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి వారు పాలా భిషేకం చేసి, నిరసన తెలిపారు. వైసీపీ ప్రభు త్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం జగన్మోహన్రెడ్డివి డైవర్షన్ రాజకీయాలు అని, వికేంద్రీకరణ పేరుతో కట్టడాలు, కూల్చడం, దారుణంగా పన్నులు వేసి, ప్రజలను బా ధించడం ఆయన దినచర్యగా మారిందని వారు విమర్శించారు. రాష్ట్ర ప్రజలు వీటం న్నింటినీ గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో ప్రభు త్వానికి బుద్ధి చెబుతారని వారు హెచ్చరించారు. పార్టీ డివిజన్ నేతలు దాసరి దుర్గారావు (పెప్సీ), దాసరి ఉదయశ్రీ, సీహెచ్ శ్రీనివా సరావు, శివకుమారి, అమ్మరావు, అన్నావతు శ్రీను, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.