హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్పును ఉపసంహరించుకోవాలి

ABN , First Publish Date - 2022-10-02T05:47:14+05:30 IST

హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు కొనసాగించాలని నందిగామలో చేపట్టిన రిలే దీక్షలు కొనసాగుతున్నాయి.

హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్పును ఉపసంహరించుకోవాలి
రిలే దీక్షలో పాల్గొన్న తంగిరాల సౌమ్య

మాజీ ఎమ్మెల్యే సౌమ్య

నందిగామ, అక్టోబరు 1: హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు కొనసాగించాలని నందిగామలో చేపట్టిన రిలే దీక్షలు కొనసాగుతున్నాయి.  మాజీ  ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య శనివారం దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ,  ప్రభుత్వాలు మారినప్పుడల్లా విశ్వవిద్యాలయాల పేర్లు మార్చడం హేయమన్నారు. తక్షణమే ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.  మహిళా నాయకులు దీక్ష చేపట్టారు.సీసీఐ నాయకుడు చుండూరు సుబ్బారావు సందర్శించి మద్దతు తెలిపారు. 

Read more