ఆ మహిళల ధైర్యానికి వందనం: చంద్రబాబు ట్వీట్

ABN , First Publish Date - 2022-05-01T21:13:08+05:30 IST

ఏపీలో పన్నుల బాదుడు, పెంచిన కరెంట్ చార్జీలపై వైసీపీ ఎమ్మెల్యేలను సైతం నిలదీస్తున్న ఆ మహిళల..

ఆ మహిళల ధైర్యానికి వందనం: చంద్రబాబు ట్వీట్

Vijayawada: ఏపీలో పన్నుల బాదుడు, పెంచిన కరెంట్ చార్జీలపై వైసీపీ ఎమ్మెల్యేలను సైతం నిలదీస్తున్న ఆ మహిళల ధైర్యానికి వందనం అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. ‘‘తమ జేబులు గుల్ల చేసిన డబ్బులతోనే సంక్షేమం అంటూ తమను మోసం చేస్తున్న వైనంపై గళమెత్తిన సోదరీమణుల ఆవేదనకు ప్రభుత్వం సమాధానం ఇవ్వగలదా?.. జగన్ జేబు నుంచి ఇచ్చారా?...అసలు దోచింది ఎంత? ఇచ్చింది ఎంత? మేము వాటితో బతుకుతున్నామా? అంటూ ఆడబిడ్డల ప్రశ్నలకు ఈ ప్రభుత్వం ఏమి సమాధానం చెపుతుంది?.. ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని, తాము పడుతున్న కష్టాన్ని వివరిస్తూ ప్రశ్నించిన ఆ సోదరి తెగువ అందరికీ స్ఫూర్తి కావాలి..’’ అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

Read more