స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ సేవలు ప్రశంసనీయం

ABN , First Publish Date - 2022-09-11T06:22:06+05:30 IST

గ్రామీణ ప్రాంత యువత, మహిళల సాధికారత కోసం స్వ ర్ణభారత్‌ ట్ర్‌స్ట చేస్తున్న సేవలు ప్రశంసనీయమని కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమశాఖ సహాయమంత్రి భారతి పవార్‌ అన్నారు.

స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ సేవలు ప్రశంసనీయం
వెంకయ్యను మర్యాదపూర్వకంగా కలిసిన కేంద్ర సహాయ మంత్రి భారతీ పవార్‌

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయమంత్రి భారతీ పవార్‌

ఉంగుటూరు, సెప్టెంబరు 10 : గ్రామీణ ప్రాంత యువత, మహిళల సాధికారత కోసం స్వ ర్ణభారత్‌ ట్ర్‌స్ట చేస్తున్న సేవలు ప్రశంసనీయమని కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమశాఖ సహాయమంత్రి భారతి పవార్‌ అన్నారు. నగర పర్యటనలో ఉన్న ఆమె శనివారం కృష్ణాజిల్లా, ఉంగుటూరు మండలం, ఆత్కూరులోని స్వర్ణభారత్‌ ట్ర్‌స్ట (విజయవాడ చాప్టర్‌)ను సందర్శించారు. ఈ సందర్భం గా మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ట్ర స్ట్‌ చైర్మన్‌ డాక్టర్‌ కామినేని శ్రీనివా్‌సతో కలిసి ట్ర స్ట్‌లోని వివిధ విభాగాలను సందర్శించారు. శిక్షణార్థుల వసతి, భోజనశాల, క్రీడలు, వ్యాయామ సౌకర్యాలను సందర్శించి ఆనందం వ్యక్తం చేశారు. ట్ర స్ట్‌ చైర్మన్‌ డాక్టర్‌ కామినేని శ్రీనివాస్‌ ట్రస్ట్‌ కార్యక్రమాల గురించి తెలిపారు. ప్రత్యేకించి ముప్పవర పు ఫౌండేషన్‌ ద్వారా అందిస్తున్న వివిధ కోర్సుల గురించి మంత్రికి వివరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయాన్ని పొందకుండా సేవాతత్పరత కలిగిన వ్యక్తులు, సంస్థల సహకారంతో నిర్వహిస్తున్న స్వర్ణభారత్‌ లాంటి సేవాసంస్థను సందర్శించడం ఆనందంగా ఉందని ట్ర్‌స్ట నిర్వాహకులను, ఇతర సిబ్బందిని ఆమె అభినందించారు. శిక్షణార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.

Read more