బిల్లు కట్టమంటే దాడికి యత్నం..!

ABN , First Publish Date - 2022-09-19T06:25:58+05:30 IST

విద్యుత్‌ బిల్లు బకాయిలు చెల్లించాలని కోరిన ట్రాన్స్‌కో సిబ్బందిపై వైసీపీ నేత, పంచాయతీ వార్డు సభ్యుడు దాడికి యత్నించిన ఘటనపై శనివారం రాత్రి పోలీసులు కేసు నమోదు చేశారు.

బిల్లు కట్టమంటే దాడికి యత్నం..!

  వైసీపీ నేతపై విద్యుత్‌ సిబ్బంది ఫిర్యాదు

కేసు నమోదు

కంచికచర్ల, సెప్టెంబరు 18 : విద్యుత్‌ బిల్లు బకాయిలు చెల్లించాలని కోరిన ట్రాన్స్‌కో సిబ్బందిపై వైసీపీ నేత, పంచాయతీ వార్డు సభ్యుడు దాడికి యత్నించిన ఘటనపై శనివారం రాత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. కంచికచర్లలో విద్యుత్‌ సిబ్బంది ప్రత్యేక బృందాలుగా పట్టణంలో బకాయిలు వసూలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం నలుగురు సిబ్బంది స్థానిక సంజీవ్‌నగర్‌ కాలనీలోని బి.స్వరూపరాణి పేరుతో ఉన్న సర్వీస్‌ నెంబరు 6311622000867పై బకాయిలు చెల్లించాలని కోరారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన స్వరూపరాణి భర్త, వైసీపీ నేత, 20వ వార్డు సభ్యుడు అయిన బి.శంకర్రావు అతడి కొడుకుతో కలిసి విద్యుత్‌ సిబ్బందిపై అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడికి దిగారు. ఈ పరిణామానికి భీతిల్లిన విద్యుత్‌ సిబ్బంది విషయాన్ని పై అధికారులకు తెలిపారు. తమ విధులకు ఆటంకం కలిగించటమే కాకుండా బండరాయి, కర్రతో దాడికి ఉపక్రమించి చంపుతామని బెదిరించారని విద్యుత్‌ సిబ్బంది పోలీసులకు శనివారం రాత్రి ఫిర్యాదు చేశారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ సుబ్రహ్మణ్యం తెలిపారు.


Read more